Hk tycoon offers fortune to marry off gay daughter

ong, sesilchaojsung, milliionaire, industrialist, marriage offer, 350crores, jiji daughter, machester university, architecture, lesbian

Hong Kong tycoon offers $65 million bounty to marry off 'lesbian' daughter

lesbian.gif

Posted: 09/28/2012 03:28 PM IST
Hk tycoon offers fortune to marry off gay daughter

Hong Kong tycoon offers $65 million bounty to marry off 'lesbian' daughter

 తళుక్కుమన్న తారలా సిల్క్ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ యువతి పేరు జిజీ చావో.. వయసు 33 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. ఎవరైనా ఈమెను మెప్పించి ఒప్పించి పెళ్లాడితే రూ.357 కోట్లు ఇస్తానంటున్నాడు ఈమె తండ్రి సెసిల్ చావో జె సుంగ్. ఈయన హాంకాంగ్‌లో అపరకుబేరుడు. ఔను.. మీరు ఊహించినట్లే ఇందులో ‘మెప్పించి ఒప్పించి’ అన్నచోటే చిన్న చిక్కుంది. జిజీ లెస్బియన్. అంటే మహిళలతో మాత్రమే సంపర్కంలో పాల్గొనే స్త్రీ. ఈమె పక్కన సూట్ ధరించిన సీన్ ఈవ్ ఈమెకు ‘సహధర్మచారిణి’!! వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి మొగ్గ తొడగటంతో ఈ ఏడాదే ఫ్రాన్స్‌లో ఒక్కటయ్యారు. మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో పట్టా పొందిన తన కుమార్తెను యోగ్యుడైన వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలన్నది సెసిల్ చావో కోరిక.

Hong Kong tycoon offers $65 million bounty to marry off 'lesbian' daughter

కానీ అమ్మాయేమో ఇలా!! దీంతో.. తన కుమార్తెను ఎవరైనా మెప్పించి ఒప్పించి పెళ్లాడితే రూ.357 కోట్లు కట్నకానుకగా ఇచ్చి సలక్షణంగా వివాహం చేసేందుకు సిద్ధమని ఆయన బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ జిజీ చావో ఫేస్‌బుక్ చిరునామాకు కుప్పలు తెప్పలుగా సందేశాలు వచ్చిపడుతున్నాయి. విశేషమేంటంటే.. అందులో కొంతమంది ‘గే’లు(స్వలింగ సంపర్కులు) కూడా ఉండడం!! తన తండ్రి ప్రతిపాదన ఆసక్తికరంగా ఉందని, స్వలింగ సంపర్కంపై ఉన్న సామాజిక కట్టుబాట్ల కారణంగానే తన తండ్రి భారీ మొత్తాన్ని ప్రకటించి ఉండవచ్చని జిజీ చావో వ్యాఖ్యానించింది. ఈమె మోడలింగ్‌తోపాటు పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. అన్నట్లు ఆమె తండ్రి కూడా తక్కువేమీ తినలేదు. 10 వేల మంది అమ్మాయిలతో తనకు ‘స్నేహం’ ఉన్నట్లు ఆయనే ప్రకటించారు. సిసిల్ చావోకు స్థిరాస్తి వ్యాపారంతోపాటు నౌకలు కూడా ఉన్నాయి. ప్లేబాయ్‌లా గడిపే ఆయన ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. ఆయన ముగ్గురు సంతానంలో జిజీ చావో పెద్ద కుమార్తె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anti muslim film producer arrested
Osama bin laden was blind in one eye  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles