Mothers sourcing breast milk on social media

Mothers sourcing breast milk on social media,breast milk, breast milk for cancer patients, social media, world news

Mothers sourcing breast milk on social media

Mothers.gif

Posted: 09/04/2012 01:13 PM IST
Mothers sourcing breast milk on social media

Mothers sourcing breast milk on social media

ఆస్ట్రేలియాలో పిల్లలకు పాలివ్వడం సాధ్యం కాని తల్లులు ఆ పాలను విరాళంగా ఇవ్వడానికి ఉత్సాహపడిపోతున్నారు. సామాజిక మీడియా వెబ్‌సైట్లలో తల్లి పాలు కావాలని ఇప్పటికే అనేక అభ్యర్థనలు ప్రకటితమవుతున్నాయి. హ్యూమన్‌ మిల్క్‌ 4 హ్యూమన్‌ బేబిస్‌అనే నెట్‌వర్క్‌ తల్లిపాలు కావాల్సిన బేబీలను, అదేవిధంగా చనుబాలను దానంచేయదలచిన తల్లులను ఒకే దగ్గరకు చేర్చి సేవా తత్పరతను చాటుకుంటోంది. అయితే తల్లులు తమ పాలను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మూడువారాల వయస్సున్న పిల్లలకు, తల్లిపాలు కావాలన్న ప్రకటనలకు అస్ట్రేలియాలో తల్లుల నుంచి భారీగానే స్పందన వస్తోంది. అంతేకాక, ఒక అరుదైన కేసులో... క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక వ్యక్తికి రోగనిరోధక శక్తి పెంచటానికి తల్లిపాలే శరణ్యమని డాక్టరు చెప్పటంతో ఆ వ్యక్తి భార్య ఇచ్చిన ప్రకటనకు కూడా తల్లులు ముందుకు వచ్చిన ఘటన ఇక్కడ చోటుచేసుకుంది.అయితే తల్లిపాల దానంలో పాలను నేరుగా పాపాయిలకు ఇవ్వటం కొంచెం రిస్కుతో కూడినదని, ఒకవేళ తల్లులకు ఏమైన వ్యాధులుంటే, ఆ వ్యాధికి సంబంధించిన బాక్టీరియా,వైరస్‌లు పిల్లలకు సంక్రమించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Mothers sourcing breast milk on social media

మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ మరియా రేయాన్‌ కూడా పీర్‌ టు పీర్‌( తల్లి నుంచి పిల్లకు నేరుగా) పాలను అందించటం ప్రమాదంతో కూడిన ప్రక్రియ అని ఒప్పుకుంటున్నారు. పాలను దానంచేసే తల్లులు రిజస్టర్‌ చేసిన మిల్క్‌ బ్యాంక్‌ల సేవలను ఎంపికచేసుకోవాలని అన్నారు. కొన్ని తల్లిపాల కేంద్రాలు కూడా తల్లి నుంచి తీసుకున్న పాలను నిలువచేయటం జరుగుతుంది. ఒకవేళ కేంద్రాలు సరైన శుభ్రత, ఇతర జాగ్రత్తలు చేపట్టకపోతే ఆ పాలను తాగిన శిశువుల్లోకి బాక్టీరియా తదితర క్రిములు చేరిపోతాయని మరియా ఒక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. మరోవైపు తల్లిపాల నిలువ ఇక్కడ క్రమంగా వ్యాపారంగా మారుతోంది.తల్లి ఇచ్చిన పాలు నిలువచేయటం కూడా ఖర్చుతో కూడినదని మరియా అంటున్నారు. వడపోసిన, శుద్ధిచేసిన తల్లి పాలను కేవలం నిర్వహణ ఖర్చులు వచ్చేవిధంగా 1.2 లీటర్ల తల్లిపాలను 80 డాలర్ల ధరచొప్పున అవసరమైన పాపలకు అందిస్తున్నామని మరియా తెలిపారు. అయితే నేరుగా తల్లి అవసరమైన పాపకు తన పాలను అందిస్తే తాము ఎటువంటి రుసుము తీసుకోవటంలేదని ఆమె తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook slaves
Bacteria on mobile phones than a toilet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles