Party united despite karnataka cross voting bjp

Party united despite Karnataka cross-voting: BJP

Party united despite Karnataka cross-voting: BJP

BJP.gif

Posted: 07/24/2012 12:54 PM IST
Party united despite karnataka cross voting bjp

Party united despite Karnataka cross-voting: BJP

రాష్ట్రపతి పదవికిజరిగిన ఎన్నికల్లో కర్ణాటకలోనే అత్యధికంగా 16 బీజేపీ ఓట్లు క్రాస్‌కావడాన్ని ఆ పార్టీ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోతోంది. మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్ట మంటగలిసిందని అధిష్ఠానం పెద్దలు మండిపడుతున్నారు. రహస్య ఓటింగ్ కావడం వల్ల క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డవారిని గుర్తించడం చాలా కష్టం. ఈనేపథ్యంలో ఇందుకు దారితీసిన కారణాలను వివరిస్తూ తక్షణం తమకు ఒక నివేదికను అందచేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కరి, సీఎం శెట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.  రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే రాజీనామా కారణంగా పోలైన 223 ఓట్లలో 3 ఓట్లు చెల్లలేదు. వీటిలో యూపీఏ అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ప్రణబ్‌ముఖర్జీకి 117 ఓట్లు దక్కగా ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న పి.ఎ.సంగ్మాకు 103 ఓట్లు మాత్రమే దక్కాయి. శాసనసభలో అధికార బీజేపీకి 119 మంది సభ్యులు ఉన్నందున ఈ లెక్క ప్రకా రం సంగ్మాకు 119 ఓట్లు రావాల్సి ఉంది. అయితే సంగ్మాకు 103 ఓట్లు మాత్రమే లభించాయి. బీజేపీకి చెం దిన 16 మంది క్రాస్ ఓటింగ్‌కు పాల్ప డ్డ సంగతి స్పష్టంగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  17 children killed22 injured as school bus overturns
Kiran kumar reddy promises relief to power starved industry in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles