Cpi members attacked ponnalas lakshmaiah residence

CPI members attacked Ponnala's Lakshmaiah residence, drinking water woes of flood affected

CPI members attacked Ponnala's Lakshmaiah residence

Ponnala.gif

Posted: 06/29/2012 04:40 PM IST
Cpi members attacked ponnalas lakshmaiah residence

CPI members attacked Ponnala's Lakshmaiah residence

కొన్నేళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం... సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకూ ఇక్కడ్నుంచి కదలనివ్వం.. ఇదీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఎదురైన తిరస్కారం. మంచినీటి విషయమై మహిళలు నిలదీశారు. మంత్రి కాన్వాయ్ ను   ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. హామీ ఇవ్వాల్సిన మంత్రి అసహనం వ్యక్తం చేసి చల్లగా జారుకున్న సంఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. చేర్యాల మండలం ఆకునూరులోని ఎస్సీ కాలనీలో కోటీ 81 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి పొన్నాల లక్ష్మయ్య  వచ్చారు. కార్యక్రమం అనంతరం మంత్రి వెళ్తుండగా కాలనీలోని మహిళలు అడ్డుకున్నారు. తమకు సిసి రోడ్డు అవసరం లేదని, ఎంతో కాలంగా తాగునీటి కోసం అల్లాడుతుంటే మా సమస్యను ఎందుకు పరిష్కరించరని మంత్రిని నిలదీశారు. ఖాళీబిందెలతో  మంత్రి కాన్వాయ్  ఎదుట బైఠాయించారు. హామీ ఇచ్చేవరకూ ఇక్కడి నుండి వెళ్లనిచ్చేది లేదని భీష్మించారు. కానీ మంత్రి మహిళలపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంట వచ్చిన కాంగ్రెస్‌ కార్యక్తలకు మహిళలకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు త్వరలో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి మంత్రి అక్కడి నుండి బయటపడ్డారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ten karnataka ministers to resign
Invest in afghanistan india tells traders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles