160 సంవత్సరాల కిందటి ఈ ఆలయం దేశ విభజన సమయం నుంచి మూసిఉంది. అప్పట్లో ఇండియాలో ఉన్న బాబ్రీ మసిదును గుల్చివేస్తే .. ఎన్నోగొడవలు జరిగాయి. మరి ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న హిందూ దేవాలయాన్ని ద్వంసం చేస్తే హిందువులు ఉరుకుంటారా? అక్కడున్న పభుత్వవ్యవస్థ ఏం చేస్తుందని పాకిస్తాన్ లో ఉన్న హిందువులు అడుగుతున్నారు.హిందు ఆలయాన్ని తెరవాల్సిందిగా ఆ పుణ్యక్షేత్రం అర్చకుడి కూతురు ఫూల్వాటీ పెషావర్ హైకోర్టులో గత సంవత్సరం పిటిషన్ వేశారు. వారి కోరిక మేరకు ఆలయం తెరవాలని పెషావర్ హైకోర్టు తీర్పు నిచ్చింది. అప్పటి నుంచి ఈ దేవాలయం తెరచారు. రెండు నెలల్లో ఈ ఆలయంపై మూడు సార్లు దాడులు జరిగాయని ఆలయ ధర్మకర్త తెలిపారు. సాయంకాలం ఆరున్నర గంటలకు గుడి వద్దకు వచ్చే సరికి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులను చూశానని ఆలయ ధర్మకర్త తెలిపారు. వారు దేవాలయంలోని చిత్ర పటాలను కాల్చివేశారని ఆ తర్వాత విగ్రహాలతో పరారయ్యారని ఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగినంత బందోబస్తు కల్పించాలని స్థానిక హిందూ నేతలు పోలీసులను కోరారు. పాకిస్థాన్లో ఓ హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పెషావర్లో ఉన్న గోరఖ్నాథ్ దేవాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దేవాలయంలోని చిత్ర పటాలను కాల్చి వేశారని స్థానికులు, పోలీసులు తెలిపారు. అంతే కాకుండా దుండగులు కొన్ని విగ్రహాలను సైతం ఎత్తుకెళ్లారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more