Sridevi with daughter jhanvi at a show of wedding

Sridevi with daughter Jhanvi at a show of wedding, Sridevi have two daughters - Jhanvi Kapoor

Sridevi with daughter Jhanvi at a show of wedding

Sridevi.gif

Posted: 05/16/2012 01:22 PM IST
Sridevi with daughter jhanvi at a show of wedding

Sridevi with daughter Jhanvi at a show of wedding

ఇటీవల ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పిన సంగతులు అభిమానులకి తీవ్రమైన నిరాశ కలిగించినట్టు తెలుస్తోంది. అందాలతార శ్రీదేవి గురించి చెప్పుకోవడానికి అక్షరాలు చాలవని చెప్పొచ్చు. అందానికి...అభినయానికి నిర్వచనంగా నిలిచిన శ్రీదేవి, ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ అతిలోకసుందరిగానే నిలిచిపోయింది. తను సినిమాలకు దూరమై చాలాకాలం కావడంతో, ఆమె కూతురు జాహ్నవి సినిమాల్లో వస్తుందని ఆశతో అభిమానులండేవారు. తల్లి పోలికలున్న జాహ్నవి తప్పక తెరపైకి వస్తుందని, అందుకు సంబంధించిన సమాచారం త్వరలోనే తెలుస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే

జాహ్నవి వయసు 15 సంవత్సరాలేనని, ప్రస్తుతం ఆమె దృష్టంతా చదువుపైనే ఉందని ఆ పత్రిక వారితో శ్రీదేవి చెప్పిందట. చిన్నతనంలోనే తాను సినిమాల్లోకి వచ్చినందువల్ల పెద్దగా చదువుకోలేకపోయానని, అందువల్ల జాహ్నవిని బాగా చదివించాలనుకుంటున్నానని తన మనసులోని మాటని బైటపెట్టింది. జాహ్నవిని బాగా చదివించి ఆ తర్వాత పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నానని, ఒకవేళ నటి కావాలనే ఆసక్తి ఆమెకు వుంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పింది. జాహ్నవిలో శ్రీదేవిని చూసుకుందామనుకున్న అభిమానుల ఆశపై, ఈ మాటలు నీళ్లు చల్లాయని చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  40k crore fraud in maya rule
Cbi raids yeddyurappa residence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles