Urine powered restaurant pops up in melbourne

Urine-powered restaurant pops up in Melbourne.Pee-Powered Restaurant Pops Up in Melbourne Concrete Playground Sydney.

Urine-powered restaurant pops up in Melbourne.gif

Posted: 04/27/2012 03:21 PM IST
Urine powered restaurant pops up in melbourne

bakkarకరెంట్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు, వాటర్ కావాలి. కానీ ఆస్ట్రేలియాలో ఓ రెస్టారెంట్ లో వారు మాత్రం మనం విసర్జించే మూత్రంతో ఆ రెస్టారెంట్ కి కావాల్సిన విద్యుత్ ని తయారు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్‌లో విద్యుచ్ఛక్తి ఉత్పాదనకు కస్టమర్ల మూత్రాన్ని ఉపయో గిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై యజమానులకు గల ఆసక్తి రెస్టారెంట్‌ నిర్మాణంలో పునరు పయోగ పదార్థాలు నూరింటిని వినియోగించేట్లు చేసింది.

డచ్‌ డిజైనర్‌ జూస్ట్‌ బాక్కర్‌ ఈ హోటల్‌కు రూపకల్పన చేశారు. హోటల్‌ రూపకల్పనకు సంబంధించిన వివరాలను బాక్కర్‌ వెల్లడిస్తూ, ‘నత్రజనికి నమ్మకమైంది మూత్రం. అది ఎంతో విలువైంది. ఒక హెక్టార్‌ పంటకు ఎరువు కోసం పాతిక మంది మూత్రం మాత్రమే కావలసి ఉంటుంది. నేను రెస్టారెంట్‌ను రివర్స్‌ లో రూపకల్పన చేశారు. వ్యర్థాల ఉత్పత్తిని మదింపు వేస్తూ వెనుక నుంచి ప్రారంభించాను. అక్కడి నుంచి ముందుకు వెళ్లాను. అసలు ఏమాత్రం వ్యర్థాన్ని సృష్టించని రెస్టారెంట్‌ను నిర్మించాలన్నది నా కల. ఇప్పుడు దానిని సాధించానని అని చెప్పారు. హోటల్‌ను ఇన్సులేట్‌ చేయడానికి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ‘స్మార్ట్‌ ప్లానెట్‌’ తెలియజేసింది. భవనానికి ఇంధన శక్తిని పునరుపయోగ పదార్థాల నుంచి తయారు చేస్తున్నారు.

ఈ ఇంధన శక్తి హోటల్‌ అవసరాలను ఇంతవరకు తీరుస్తున్నది. రెస్టారెంట్‌ పని చేయడం ప్రారంభించింది. సంస్థకు కావలసిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి తగినంతగా మూత్ర విసర్జన చేయవలసిందని కస్టమర్లను యజమానులు కోరుతారనడంలో సందేహం ఏమాత్రం లేదు. మరి మన దేశంలో కూడా ఇలాంటి ప్రయోగాలతో విద్యుత్ ని తయారు చేసుకుంటే కరెంట్ కోతలు ఉండవేమో .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh summoned by jaipur court
Actress rekha nominated for rajya sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles