Ganga bhavani and rajini reddy

Clash took place between leaders Mahila Congress Ganga Bhavani and Rajini Reddy groups at Gandhibhavan. ganga bhavani, rajini reddy, mahila congress, hyderabad

Clash took place between leaders Mahila Congress Ganga Bhavani and Rajini Reddy groups at Gandhibhavan. ganga bhavani, rajini reddy, mahila congress, hyderabad

Ganga Bhavani and Rajini Reddy.GIF

Posted: 03/08/2012 06:52 PM IST
Ganga bhavani and rajini reddy

Ganga-bhavaniకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గంగాభవానీ మహిళా దినోత్సవం నాడు రచ్చ రచ్చ చేసింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న గంగా భవానీ తన విశ్వ రూపాన్ని గాంధీ భవన్ సాక్షిగా చూపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో సమావేశం  ఏర్పాటు చేసింది. మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు గంగా భవానీ, మరో నేత రజినీరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రజినీ రెడ్డి వర్గీయులు గంగా భవానీ వర్గంపై విరుచుకుపడ్డారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

పరస్పరం కొట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది. తనను సమావేశానికి ఆహ్వానించకపోవడంపై రజినీ రెడ్డి గంగా భవానీపై మండిపడ్డారు. కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తూ గంగా భవానీ కావాలనే తనను పక్కన పెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి రేఖ అనే మహిళకు సమావేశ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై కూడా రజినీ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. గాంధీభవన్‌లో నాయకులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నాలు చేశారు. సమాచారాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా చేరవేశారు. మరి మహిళా దినోత్సవం నాడు ప్రజా ప్రతినిధులే ఇలా కొట్టుకునే స్థాయికి వెళ్లారంటే, సిగ్గు సిగ్గు అని జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul dravid retirement
Galla jayadev said that he will contest from tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles