Cbi produces vijaya raghavan in court

CBI produces Vijaya Raghavan in Court,Vijaya Raghavan was taken into custody, Chanchalguda jail to Dilkusha Guest House,Emaar-APIIC Scam,

CBI produces Vijaya Raghavan in Court

CBI.gif

Posted: 01/30/2012 06:47 PM IST
Cbi produces vijaya raghavan in court

 CBI produces Vijaya Raghavan in Court

విచారణ పేరుతో సిబిఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిందని ఎమ్మార్ కేసులో అరెస్టైన విజయ రాఘవన్ ప్రత్యేక కోర్టులో తెలిపారు. విజయ రాఘవన్‌ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టును కోరిన నేపథ్యంలో దీనిని విచారించారు. ఈ సందర్భంగా విజయ రాఘవన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గత ఐదున్నర నెలలుగా సిబిఐ రాఘవన్‌ను విచారణ పేరుతో వేధిస్తోందని అన్నారు. రాఘవన్ ఇప్పటికే తనకు తెలిసిన సమాచారమంతా అందజేశారని, ఇక రిమాండులు, అరెస్టులు అవసరం లేదన్నారు. సిబిఐ విచారణ పేరుతో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. ఆయనను మానసికంగా కూడా వేధిస్తున్నారన్నారు. తాము చెప్పింది చేయకపోవడంతోనే సిబిఐ రాఘవన్‌ను అరెస్టు చేసిందన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టిందన్నారు.

గాయాలపాలై ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టిన విజువల్స్ చూపించి విల్లాల ఓనర్లను సిబిఐ బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. సిబిఐ చేసిన గాయాలు ఆయన ఒంటిపై ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. కాగా విచారణ పేరుతో సిబిఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని రాఘవన్ చెప్పడం కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు. దీంతో కేసు మలుపు తిరుగుతుందో చూడాలి. రాఘవన్‌ను సిబిఐ పలుమార్లు విచారించింది. వేధింపులకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వడానికి సిద్ధమని రాఘవన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కాగా స్టైలిష్ హోం రంగారావుకు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సునీల్ రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిబిఐ, నిందితులతో కుమ్మక్కయ్యారని అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం చెప్పడం లేదన్నారు. కాగా రంగారావు బెయిల్ విచారణపై ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil nadu rakes up mullaperiyar dam issue in assembly
Vasuki sunkavalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles