Kcr is from andhra

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

TDP leaders have taken the pain of taking a press party to the ancestral home of the TRS Chief K Chandrasekhara Rao in Vizianagaram district, to prove their point that he was not at all from the Telangana region for which he has been seeking statehood. .

KCR is from Andhra.gif

Posted: 12/31/2011 10:28 AM IST
Kcr is from andhra

KCR

పది సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పార్టీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన కేసీఆర్ అసలు రంగు బయట పడింది. అసలు కేసీఆర్ తెలంగాణ వాడు కాదని... ఇన్ని సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తున్న కేసీఆర్ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి ? కేసీఆర్ లో ప్రవహిస్తున్న రక్తం ఏమిటి ? కేసీఆర్ నిజమైన తెలంగాణ వాడేనా అంటే కాదని చెబుతున్నారు తెలుగు దేశం వారు. 'కేసీఆర్‌ది విజయనగరం జిల్లా. ఆయనది తెలంగాణ కాదు'... 'ఔను. ఆయనది విజయనగరం జిల్లా బుడ్డిపేట గ్రామం' అంటూ ఆంధ్రా ప్రాంత టీడీపీ నేతలు ఈ విషయాన్ని నిరూపించేందుకు ప్రయత్నించారు.

"ప్రత్యేక తెలంగాణవాదంతో రాష్ట్రాన్ని విభజించేందుకు పోరాడుతున్న కేసీఆర్ తన స్వగ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలని, కేసీఆర్ తాత వెంకట్రావు, ముత్తాత రామారావు మా ఊరిలోనే ఉండేవారు. కేసీఆర్ తాత చిన్నతనంలోనే వారి కుటుంబం ఇక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లింది. ఇక్కడి నుంచి వలసవెళ్లి సొంత గడ్డకే అన్యాయం చేస్తున్నారు'' అని నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ తాత, ముత్తాతలు నివసించిన ఇంటి ఆనవాళ్లను 70 ఏళ్ల వయసున్న ములగశర్ల సత్యనారాయణ చూపించారు. "మాది కేసీఆర్ సామాజిక వర్గమే అని. 'కేసీఆర్ పూర్వీకులది మా ఊరే' అని స్థానికులు తెలిపారు. 'కేసీఆర్‌లో ప్రవహించే రక్తం ఆంధ్రాదే ఆయన ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు' అని ఆగ్రహించారు.

ఇన్ని ఆధారాలు లభించిన తరువాత కూడా కేసీఆర్ ని తెలంగాణ వాడేనని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారో , తరమికొడతాంఅని కేసీఆర్ అన్నట్లుగా ప్రజలే ఆయన్ని తరిమికొడతారో చూడాలని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr party will not contest
Silence is part of strategy says kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles