Top ten powerful man in forbes list

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips .

top ten powerful man in forbes list.gif

Posted: 12/22/2011 10:44 AM IST
Top ten powerful man in forbes list

ఫోర్బ్స్ మ్యాగజైన్  రూపొందించిన భవిష్యత్తు ఆశాకిరణాల జాబితాలో 10 మంది భారత సంతతి యువతకు చోటు దక్కింది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, పాప్ స్టార్ లేడీ గాగా లాంటి ప్రముఖుల సరసన వీరికి స్థానం లభించింది. 30 ఏళ్ళ లోపు ఉన్న 30 మంది ప్రభావశీలులైన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. వీరంతా సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారని కొనియాడింది.
ఇంధన, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోద, సైన్స్, డిజైన్, టెక్నాలజీ తదితర 12 రంగాలకు చెందిన ప్రముఖులను ఎంపిక చేసింది. ఒక్కో రంగంలో 30 మంది చొప్పున మొత్తం 360 మందితో జాబితా  రూపొందించింది. ఇందులో భారత సంతతికి చెందిన విద్యార్థి పరమ్ (17) ఉన్నారు. కార్ల పొగగొట్టంలో అమర్చే ఒక పరికరాన్ని తయారు చేశాడు. ఇది కార్బన్ డైయాక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చుతుంది. డమాస్కస్ ఫార్చూన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వివేక్ నాయర్ (23) ను కూడా ఫోర్బ్స్ ఎంపిక చేసింది. పరిశ్రమల నుండి వెలువడే కర్భన ఉద్గారాలను నానో ట్యూబ్ లుగా మార్చే సాంకేతిక పరిజ్ణానికి నాయర్ రూపొందించాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థిక సలహాదారు మోహింద్రా (25) సిటీ గ్రూపునకు చెందిన మానవీర్ నిజ్జర్ (28), పిన్న వయసులో గోల్డ్ మాన్ సాచ్చ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కునాల్ షా (29), బయోలాజికల్ డైనమిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజ్ క్రిష్ణన్ (29), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్జన్ విద్యార్థి సిద్ధాంత్ గుప్తా (27)లు జాబితాలో స్థానం పొందారు. పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్న నికిల్ అరోరా (24), సీఎస్ బీసీలో నిర్మాతగా పనిచేస్తున్న మనీత్ ఆహూజా (27)ల ప్రతిభను కూడా ఫోర్బ్స్ గుర్తించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agitators against center committe arrested at vizag
Jagan with sujana chowdary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles