మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి ఒక్కరికి కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇటువంటి విలువైన జీవితాన్ని కేవలం వినోదాలతో సమయాన్ని వృధా చేసుకోకుండా కెరీర్ మీద కొంచెం దృష్టి సారిస్తే... జీవితాంతం సుఖంగా జీవించవచ్చు. ఒక్కసారి ఈ విలువైన వయస్సు చేజారిపోతే... తరువాత లైఫ్ మొత్తం బాధపడాల్సి వస్తుంది.
ముఖ్యంగా ప్రస్తుతకాలంలో కాలేజీ జీవితాన్ని జాలీగా గడుపుతున్నవారు తమ కెరీర్ మీద ధ్యాసను మళ్లించుకోవాలి. సాధారణంగా కాలేజీ లైఫ్ అంటే ప్రతిఒక్కరికి ఎంతో ప్రత్యేకమైనది. తోటి స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం, ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకోవడం వంటి అన్ లిమిటెడ్ ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే ఇటువంటి సరదాల మధ్యలోనే తమ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా భవిష్యత్తు కార్యాచరణాల మీద దృష్టి సారించలేకపోతున్నారు. తమ కెరీర్ కు అవసరమయ్యే ప్లాన్లను మలుచుకోలేకపోతున్నారు. యుక్తవయస్సు అన్నాక ఎంజాయ్ మెంట్ తప్పనిసరియే... కాకపోతే దాంతోపాటు కెరీర్ మీద దృష్టి సారించడం ఎంతో ముఖ్యం.
ఒక్క కాలేజీ లైఫ్ లోనే రకరకాల ప్రాంతాల నుంచి భిన్న అభిప్రాయాలు కలిగిన అన్యమతాలవారు ఒక చోటుకు చేరుకుంటారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క అలవాటును కలిగి వుంటారు. కొందరు చదువులో మంచి ప్రతిభను ప్రసాదిస్తే... మరికొందరు కల్చరల్ యాక్టివిటీస్ లో మంచి ప్రావీణ్యం కలిగిన వారుంటారు. కొందరు ఆటపాటల్లో ఆరితేరితే... మరికొందరు సాహసోపేతమైన విద్యలను ప్రదర్శించేవారుంటారు. ఇటువంటి భిన్నరకాల విద్యార్థుల మధ్యే మన జీవితానికి పునాది వేసుకోవాలి. ఒక్కొక్కరు పరస్పరం పలకరించుకుంటూ.. వారి దగ్గరున్న సకల విద్యల గురించి తెలుసుకుంటూ.. మనలో వున్న ప్రతిభను వారికి అందించేలా వుండాలి. బంగారు భవితను సక్రమంగా తీర్చిదిద్దుకోవడానికి, అన్నివిధాలుగా అన్ని రంగాలలో పరిణతిని పెంపొందించుకోవడానికి ఒక్క కాలేజ్ లైఫే సరియైన అవకాశం అని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం వుండదు. కాబట్టి అందుకు తగ్గట్టుగా కొన్ని ప్రణాళికలను అలవరుచుకోవలి వుంటుంది.
కాలేజీ జీవితంలో కెరీర్ ను మలుచుకోవడానికి అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు :
1. కాలేజ్ లో అందరూ ఒకే చోట కలుసుకునే ముఖ్యమైన అడ్డా క్యాంపస్. అటువంటి చోట నలుగురితో కలివిడిగా వుంటూ, స్వేచ్ఛను పంచుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, వారి అలవాట్లకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలి అనే విషయాలను కాలేజీ క్యాంపస్ నుంచే తెలుసుకోవడానికి వీలుగా వుంటుంది. అప్పుడే భవిష్యత్తులో ఎక్కడైనా ఉద్యోగం లభించినప్పుడు అక్కడ నిర్వహించే టీం వర్క్ లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. నలుగురితో కలిసికట్టుగా లేకుండా కేవలం ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తే... మనకు లభించాల్సిన లోకజ్ఞానాన్ని కోల్పోతాం. ఉద్యోగాల్లో ఎవరితో మాట్లాడకుండా వుంటే.. అటువంటి ఉద్యోగాల్లో రాణించడం కష్టతరం అవుతుంది. కాబట్టి యుక్తవయస్సులోనే నలుగురితో కలవడిగా వుంటేందుకు ఆసక్తిని కలిగి వుండాలి.
2. కాలేజీలో ప్రవేశం అయిన మొదటి రోజునుంచే మీరు మీ జీవిత లక్ష్యాలు, ఆశయాల గురించి ఒక దృఢమైన నిర్ణయాన్ని ఏర్పరుచుకోవాలి. దానికి అనుగుణంగానే మీ తోటి విద్యార్థుల సహాయాన్ని, సలహాలను పాటించుకోవాలి. మొదటినుంచే మీ గమ్యాన్ని చేరు సరైన దారిని ఎంచుకోవాలి. ఆ దారిబాటలోనే ప్రయాణం కొనసాగించేందుకు ప్రయాణించాలి. అయితే కొంతమందికి వాటిని ఎలా అలవరుచుకోవాలో, వారి అభిరుచులేంటో తెలియక తికమకపడుతుంటారు. అటువంటి వేళల్లో కాలేజీలో వున్న తోటి స్నేహితుల సహాయంతో వాటి గురించి తెలుసుకోవడానికి ఎంతో వీలుగా వుంటుంది.
3. ప్రతిరోజూ కేవలం క్లాసులకే మాత్రమే కాదు... ఆ కాలేజీలో నిర్వహించే సోషల్ యాక్టివిటీస్ లోను, క్రీడా పోటీలలోను, ఇతర కార్యక్రమాలలోనూ పాల్గొనడం అంతే ముఖ్యం. దీంతో రకరకాల మనుషులను, వారి మనస్తత్వాలను, వారి అలవాట్లను, వారి జీవన విధానాలను తెలుసుకోవచ్చు. వాటి ఆధారంతో కాలానికనుగుణంగా నడుచుకోవడానికి కొన్ని విషయాలు తెలుస్తాయి. మానసిక పరిణతి కూడా లభిస్తుంది. అక్కడే మంచి, చెడు స్నేహితుల వివరాలను కూడా పసిగట్టవచ్చు. దాంతో ఎవరితో ఎలా వుండాలి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి అనే తుది నిర్ణయానికి చేరుకోవచ్చు.
4. ప్రస్తుతకాలంలో ఉద్యోగం సంపాదించడానికి కేవలం చదువు మాత్రమే సరిపోదు. అన్ని రంగాలలోనూ కొంతలో కొంతైనా పరిజ్ఞానాన్ని కలిగి వుండాలి. వ్యాసరచన, డిబేట్, ఇంటర్ కాలేజీ పోటీలు, సెమినార్లు వంటి అన్ని విభాగాల్లోనూ పాలు పంచుకోవాలి. ఆల్ రౌండర్ గా వుంటూ తమలో వున్న ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలి. ఇలా ఈ విధంగా చేస్తే.. తమదైన ఒక ప్రత్యేక ముద్రను నలుగురిలో ఏర్పాటు చేసుకోవచ్చు.
5. నేటి జనరేషన్ లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వినియోగం ఎక్కువ అయిపోయింది. అయితే వీటిని ఉపయోగిస్తున్నప్పుడు అనవసరంగా కాలాన్ని వృధా చేసుకోకుండా... అందులో మీకు జ్ఞానాన్ని పొందుపరిచే ఆసక్తికరమైన గ్రూపుల్లో చేరడానికి ప్రయత్నించాలి. కుదిరితే మీ సొంత ఆలోచనలతో కూడిన ఒక బ్లాగ్ ను తయారుచేసుకుని, నలుగురికి అవసరమయ్యే లైబ్రరీలను పొందుపరచండి. దీనిద్వారా కేవలం మీరు మాత్రమే కాకుండా.. ఇతరులకు కూడా జ్ఞానాన్ని అందిస్తూ.. నలుగురితో స్నేహం పెంచుకోవచ్చు.
6. ఉన్నత జీవన విధానాన్ని పొందుపరుచుకోవాలంటే.. ముందుగా మీలో వున్న చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. అంటే... ఇతరులకు అబద్ధాలు చెప్పడం, సరిగ్గా క్లాసులకు హాజరు కాకపోవడం, ఇతరులపై లేనిపోని నిందలు మోపడం, గొడవలు - తగాదాలు దిగడం వంటి లక్షణాలను ఎప్పటికీ అలవాటు చేసుకోకూడదు. అలా కాని పక్షంలో ఇవే దుర్గుణాలు వృత్తి, వ్యక్తిగత జీవితానికి తీవ్ర ఇబ్బందులను కలుగచేస్తాయి. కాలేజీ జీవితంలో ఇటువంటి అలవాట్ల నుంచి దూరంగా వుంటే.. భవిష్యత్తులో కూడా అవి మన జోలికి రావు.
7. కాలేజీలో వున్న నేటి యువతీయువకులు కేవలం మార్కుల కోసమే వస్తుంటారు. ఏదో కాలేజీకి వచ్చామా, కొద్దిసేపు లెక్చరర్ల సోది విన్నామా, స్నేహితులతో సమయాన్ని గడిపామా, తిరిగి ఇంటికి చేరుకున్నామా అనే స్వభావంతో కాలేజీకి వస్తుంటారు. ప్రత్యేకంగా చదువు మీద ధ్యాసను చూపించరు. ఏదో బట్టీకొట్టి చదివి, పాస్ మార్కెలకు మాత్రమే అటెంప్ట్ చేస్తుంటారు. అయితే దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతారో దాన్ని మీ జీవితానికి అన్వయించుకుని చదువుకోవాలి. ఇలా చేస్తే మీరు దానిని సాధ్యమైనంతవరుకు అస్సలు మరచిపోలేరు కూడా!
8. కేవలం పరీక్ష సమయాల్లో కాకుండా, ఎప్పటికప్పుడు సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలను చదువుకోవాలి. అప్పుడే పరీక్షల్లో కనీస మార్కులతో పాసవ్వడానికి వీలుగా వుంటుంది. అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయి, మిగిలివున్న సబ్జెక్ట్ లను కూడా ఎప్పటికప్పుడూ పూర్తి చేసుకోవాలి. అలా కాకుండా చివరి సంవత్సరం వరకు వాటిని తీసుకువస్తే... ఒకేసారి అన్ని పరీక్షలు రాయలేక తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఫలితం ఫెయిల్ గానే వుండిపోతుంది. మీరు చదివే సబ్జెక్ట్ ఎప్పటికప్పుడూ అప్ డేట్ చేసుకుంటూ వుండాలి.
ఇలా ఈ విధంగా కొన్ని ప్రణాళికలను అలవరుచుకుంటే... కాలేజీ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూనే.. భవిష్యత్తు కార్యాచరణను మలుచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు.
(And get your daily news straight to your inbox)
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more
Apr 07 | ఏదైనా ఒక కంపెనీలో మనం ఉద్యోగం సంపాదించాలంటే.. ముందుగా ఆ కంపెనీ వారికి మన గురించి తెలిసిన ఒక దరఖాస్తును సమర్పించుకుంటాం. దానినే రెజ్యూమ్ అంటారు. ఈ రెజ్యూమ్ లో మన గురించి, మనలో... Read more