ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు కూడా సాప్ట్ వేర్ కంపెనీల్లో చాలా బాగా రాణిస్తున్నారు. ఇంటర్వ్యూల నుంచి ఆఫీసులో నిర్వహించే పనుల దాకా ఆడవాళ్లు తమ మొత్తం సామర్థ్యాన్ని, సద్దుగుణాలను చూపెడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే.. ఆఫీసు పనులలో మగవారికంటే ఆడవాళ్లే అన్నిటికన్నా ముందున్నారు.
అయితే తాజాగా నిర్వహించిన కొన్ని పరిశోధనల ప్రకారం... పురుషులతో పోలిస్తే.. మహిళలు ఆఫీసు మీటింగుల్లో, ఇతర సమావేశాలలో మాట్లాడటం చాలా తక్కువ అని తేలింది. అది ఏకంగా వీరిద్దరి మధ్య 75 శాతం వరకు వ్యత్యాసం వుంది. అన్ని పనులలో ముందుండే మహిళలు.. ఈ మీటింగుల్లో మాత్రం చాలా వెనుకబడిపోతున్నారు. దీనికి గల ముఖ్యం కారణం ‘‘భయం’’. కేవలం మీటింగుల్లోనే కాదు.. మహిళలు నలుగరిలో మాట్లాడాలన్న చాలావరకు భయపడిపోతారు. ఈ భయమే వారిని సమావేశాల్లో వెనక్కి నెట్టేస్తోంది.
కాబట్టి మహిళలు ఆఫీసు మీటింగుల్లో, ఇతర సమావేశాల్లో మాట్లాడాలంటే.. ముందుగా వాటికి సంబంధించిన కొన్ని ప్రణాళికలను సన్నద్ధం చేసుకోవాలి. మీటింగులో ఎలా వుండాలి..? ఎలా మాట్లాడాలి..? మీ లక్ష్యం ఏంటి..? ఏం మాట్లాడాలనుకుంటున్నారు..? అసలు మీరు మీటింగుకి ఎందుకు హాజరవుతున్నారు..? అనే విషయాలలో పూర్తిగా అవగాహన వుండటం చాలా ముఖ్యం. ముందుగా మీటింగుల్లో పాల్గొన్నప్పుడు మీలో వున్న భయాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మిగతా విషయాల గురించి ఆలోచించడానికి సాధ్యం అవుతుంది.
మీటింగుల్లో మాట్లాడటానికి ముందుగా చేసుకోవాల్సిన ప్రణాళికలు :
1. మీరు మీటింగుకి హాజరయ్యే ముందు చేసుకునే ప్రణాళికలప్రకారం ఎంత సిద్ధంగా వున్నా.. మీలో వున్న భయాన్ని దూరం చేసుకోకపోతే మొత్తం వ్యర్థం అయిపోతుంది. నలుగరిలో అవమానాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీటింగులో ఏ అంశం గురించి అయితే మాట్లాడాలనుకుని నిశ్చయించుకుంటారో... దాని గురించే ఆలోచించాలి. మీ ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించకుండా.. చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేయాలి. అలాగే సమావేశంలో పాల్గొన్న సభ్యులతో మీరు ముందుగానే ఏం చెప్పాలనుకుంటారో నిశ్చయించుకుంటే.. మీలో వున్న భయం దూరమవుతుంది.
2. మీటింగ్ లో మాట్లాడాల్సిన అంశాల గురించి ముందుగానే అన్నివిధాలుగా సిద్ధం చేసుకుని వుంచుకోవాలి. ఎవరూ లేని సమయంలో ఏదైనా ఏకాంతంగా వున్న ప్రదేశంలో మీరు నిలబడి... మీటింగ్ లో మాట్లాడుతున్నట్టు, చెప్పుకుంటున్నట్లు ప్రాక్టీస్ చేయండి. మొత్తం సవివరంగా అభ్యాసం చేయండి. అప్పుడు కొంతలో కొంతైనా మీలో వున్న భయం మాయమవుతుంది.
3. మీరు మీటింగ్ లో చెప్పబోయే అంశాలు... ఆ సమావేశంలో వున్న సభ్యులలో ఎటువంటి సందేహాలను కలుగచేస్తాయన్న అంశాల గురించి మీరు ముందే ఊహించుకుంటే ఇంకా మంచిది. అలాగే అటువంటి సందేహాలకు సంబంధించిన జవాబులు కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటే... మీటింగుల్లో మీ భయం మటుమాయం.
4. మీరు మీటింగ్ లో ఏ విషయం గురించి అయితే ప్రస్తావిస్తారో అది చిన్నదా..? పెద్దదా..? అనే సందేహాలు లేకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా చెప్పేయాలి. ఇలా చేస్తే సభ్యులు కూడా మీలో వున్న ఔన్నత్యాన్ని గమనించగలుగుతారు. అలాగే మీ సహచరులు ఎటువంటివారు.. ఎలాంటి ప్రశ్నలను అడుగుతారు.. వారి ప్రవర్తన ఎటువంటిది.. అన్న వాటిమీద కూడా గమనిస్తూ వుండాలి. ప్రతిఒక్క విషయంలోనూ భయపడకుండా తెలివిగా వ్యవహరించాలి.
5. మీటింగులో మీరు ఒక విషయం గురించి ప్రసంగిస్తున్నప్పుడు మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి కొంతమంది ఇతర విషయాలకు సంబంధించిన ప్రశ్నలను సందర్శిస్తారు. అటువంటి సమయాల్లో ఎటువంటి తబడాటు లేకుండా వాటిని సున్నితంగా తిరస్కరించండి. మీరు చెప్పాలనుకుంటున్న విషయాల గురించి మాత్రమే వ్యక్తపరచండి.
ఇలా ఈ విధంగా మీరు ముందుగానే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని మీటింగులో హాజరయితే.. మీలో వున్న భయం పోయి.. విజయాల బాటవైపు అడుగులు వేస్తారు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more
Apr 07 | ఏదైనా ఒక కంపెనీలో మనం ఉద్యోగం సంపాదించాలంటే.. ముందుగా ఆ కంపెనీ వారికి మన గురించి తెలిసిన ఒక దరఖాస్తును సమర్పించుకుంటాం. దానినే రెజ్యూమ్ అంటారు. ఈ రెజ్యూమ్ లో మన గురించి, మనలో... Read more