టోక్యో ఒలంపిక్స్ లో భారత చరిత్రను తిరిగరాసిన ధీరుడు నీరజ్ చోప్రా. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో తన ప్రత్యర్థులను చిత్తు చేసి.. భారతమాత సిగలో స్వర్ణ పతకాన్ని సాధించిన సాధారణ రైతు బిడ్డ. ఒలంపిక్స్ చరిత్రలో భారత్ అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణం సాధించాడు చోప్రా. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు ఇతర క్రీడాంశాల్లో స్వర్ణం అందినా, అథ్లెటిక్స్ స్వర్ణం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత క్రీడారంగానికి ఆ లోటు కూడా తీరిపోయింది.
ఇవాళ జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో తిరుగులేని బలంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టిన చోప్రా.. క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలోనే 86.65 మీటర్లు మేర తన బెల్లాన్ని విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. ఇక ఇవాళ జరిగిన ఫైనల్స్ లోనూ ఆయన తన ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తొలి రౌండ్ లో తన బెల్లాని ఏకంగా 87.03 విసిరి తన సత్తాను చాటాడు. ఇక రెండో రౌండ్ లో తొలి రౌండ్ కన్నా మెరుగ్గా తన బలన్ని పుంజుకుని 87.58 మీటర్ల మేర విసిరాడు.
ఇక మూడవ రౌండ్ లో తన ప్రత్యర్థులతో సమానంగా తన బెల్లాన్ని విసరిన నీరజ్ కేవలం 76.79 మీటర్ల మేర మాత్రమే బెల్లాని విసిరాడు. ఆ తరువాత 4, 5 రౌండ్లలో పెద్దగా సత్తా చాటకపోయినా ఆరవ రౌండ్ లో 84.24 మేర విసిరాడు. కాగా తన బెస్ట్ 87.58 నమోదు కావడం.. అదే ఒలంపిక్స్ లో పాల్గోన్న జవెలిన్ త్రో విభాగంలోనే ఉత్తమమైనదిగా నిలవడంతో నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచాడు. దీంతో పోటీలు పూర్తైన తరువాత ఆయనకు స్వర్ణ పతకం లభించింది. నీరజ్ చోప్పా సాధించిన ఈ బంగారు పతకం.. వ్యక్తిగత విభాగంలో రెండవది. షూటింగ్ లో అభినవ్ బింద్రా గతంలో దేశానికి స్వర్ణం సాధించిపెట్టాడు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more