కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ లో భారత షట్లర్లు వరుసగా ఇంటిబాట పడుతున్నారు. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. నిన్న రెండో రౌండ్లో పీవీ సింధు పరాజయాన్ని చవిచూసింది. కాగా ఇవాళ పురుష షెటర్ల వంతు వచ్చింది. కిదాంబి శ్రీకాంత్ తో పాటు సమీర్ వర్మ కూడా ఇవాళ వారి బాటలోనే పయనిస్తూ.. ఇంటిముఖం పట్టారు.
వరుసగా రెండు విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిమిపాలయ్యాడు. జపాన్ షట్లర్ కెంటా నిషిమోతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో కిదాంబి శ్రీకాంత్ 17-21, 13-21 తేడాతో మ్యాచ్ ను చేజార్చుకుని.. హాంకాంగ్ ఓపెన్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక గాయం కారణంగా చైనా షట్లర్ చెన్ లాంగ్ నిన్న పోటీ నుంచి తప్పుకోవడంతో క్వార్టర్స్ చేరిన సమీర్ కూడా ఇవాళ ప్రత్యర్థి లీ చీయూక్ యూ చేతిలో పరాజయం పాలయ్యాడు.
టోర్నీలో భాగంగా నిన్న ప్రణయ్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 18-21, 30-29, 21-18 తేడాతో అతికష్టంగా గెలుపొందిన కిదాంబి శ్రీకాంత్.. ఈరోజు జపాన్ షట్లర్‌కి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాడు. తొలి సెట్‌ని చేజార్చుకున్న తర్వాత పూర్తిగా ఒత్తిడిలో పడిపోయిన శ్రీకాంత్.. రెండో సెట్లో వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశాలిచ్చేశాడు. దీంతో.. నిమిషాల వ్యవధిలోనే కెంటా తిరుగులేని స్థితికి చేరుకుని.. అలవోకగా మ్యాచ్‌ని చేజిక్కించుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more