Ttd jobs heavy competition

TTD jobs heavy competition, Tirumala Tirupati Devasthanams

TTD jobs heavy competition

అందరి చూపూ ఆ పోస్టులపైనే

Posted: 11/05/2013 08:52 PM IST
Ttd jobs heavy competition

శ్రీవారి సన్నిధిలో పనిచేయడానికి.. ఏపీఎస్పీ అధికారులు బారులు తీరుతున్నారు. టీటీడీలోని సహాయ భద్రత, నిఘా అధికారి పోస్టుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. టీటీడీలో ఏవీఎస్వో పోస్టులు 10 ఉన్నాయి. వీటిని డిప్యుటేషన్‌పై సివిల్-2, ఏపీఎస్పీ-5, ఏఆర్-3 కేటాయించారు. ప్రస్తుతం ఏపీఎస్పీకి కేటాయించిన ఐదు పోస్టుల్లో మూడు ఖాళీగా ఉన్నాయి. 3,5,6 సెక్టార్లలో ఏవీఎస్వోలు లేక ఇన్‌చార్జిల పర్యవేక్షణలో కాలం వెళ్లదీస్తున్నారు. కీలకమైన అలిపిరి, తిరుచానూరు సెక్టార్లలో సైతం ఖాళీగా ఉండటం గమనార్హం.

 

3 పోస్టులకు.. 56 దరఖాస్తులు: టీటీడీకి డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఏపీఎస్పీ అధికారులు ఉర్రూతలూగుతున్నారు. ఎంతలా అంటే.. మూడు పోస్టులకు 56 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీఎస్పీ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్ల వరకు శ్రీవారి సన్నిధిలో కొలువు.. జాతీయ, అంతర్జాతీయ నేతలతో సాన్నిహిత్యం వీరిని ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న కొందరు రాజకీయ నేతలతో సిఫార్సులు చేయిస్తున్నట్లు సమాచారం.

 

రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేత తమ్ముడు ఈ పోస్టుల్లో నియామకాల కోసం తన ఖరీదైన మార్కుని చూపుతున్నారు. మూడు పోస్టుల్లో రెండు తాను టిక్ పెట్టిన వారికే ఇవ్వాలని ఇప్పటికే బ్రదర్ నుంచి సంబంధిత అధికారులకు సిగ్నల్స్ పంపినట్లు ఏపీఎస్పీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పెరిగిన సిఫార్సులు తాకిడి బెటాలియన్ డిప్యూటీ జనరల్‌కు తలనొప్పిగా మారింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles