Byreddy rajasekhar reddy to launch new seema party in tirupathi

byreddy new seema party in tirupathi, byreddy launch new seema party, byreddy new political party, byreddy rajasekhar reddy new party launch on tirupathi, breaking news, ap politics, political news, andhra news

Byreddy Rajasekhar Reddy to launch new Seema party in tirupathi, Byreddy to launch new Seema party

బైరెడ్డి కొత్త పార్టీ ఆర్పీఎస్, లోగో తిమ్మమ్మ మర్రిమాను

Posted: 08/08/2013 08:24 AM IST
Byreddy rajasekhar reddy to launch new seema party in tirupathi

రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. రాయలసీమ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణకు రాయలసీమ ప్రాంత పరిరక్షణ సమితి పేరుతో కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒక కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు తిరుపతిలో ఇందిరా మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో రాయలసీమ ప్రాంతానికి ఒక రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాలు చాలా వెనుకబడి వున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్‌ వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణవాదం తెరపైకి రావడంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాయలసీమలో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించాలని ఆయన శ్రీకారం చుట్టారు. పార్టీపేరు ప్రకటించేందుకు తిరుపతిని వేదికగా చేసుకున్నారు.

 

 బైరెడ్డి కొత్త పార్టీ ఆర్పీఎస్, లోగో తిమ్మమ్మ మర్రిమాను

రాయలసీమ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట గురువారం కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ లోగో తిమ్మమ్మ మర్రిమాను. చిత్తూరు జిల్లా తిరుపతిలోని తుడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పార్టీని, పార్టీ గుర్తును ప్రకటించారు. తాను స్థాపించిన పార్టీ పదవుల కోసం కాదని, రాయలసీమ ప్రజల కోసమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సీమ హక్కుల కోసం అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనపై ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్ని పార్టీల పైన మండిపడ్డారు. చంపిన వాడితో పాటు చంపించిన వాడిది కూడా తప్పేనని, ఆ మాటకొస్తే చంపించిన వాడిదే ఎక్కువ తప్పని అలాగే విభజన విషయంలో అనుకూలంగా చెప్పిన పార్టీలదే తప్పన్నారు. అలా చెప్పిన వారు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలే కావడం. సీమకు సంబంధం లేని నందికొండ ప్రాజెక్టు కోసం మన ప్రాంతం కూడా ఉద్యమించిందన్నారు. కృష్ణా జలాలు సీమకు రాకుండా అనేకసార్లు అడ్డుకున్నారన్నారు. విభజన వల్ల నష్టపోయేది సర్కారు జిల్లాలైతే ఉద్యమించేది మనమా అని ప్రశ్నించారు. సీమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందన్నారు. సీమ హక్కుల కోసం తాను ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను ఏడాదిగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles