Isha talwar exclusive interview

Isha Talwar, Exclusive Interview of Isha Talwar Gunde Jaari Gallanthayyinde Fame, Nitin,Nithya Menon

Isha Talwar, Exclusive Interview of Isha Talwar Gunde Jaari Gallanthayyinde Fame, Nitin,Nithya Menon

ఇషా తల్వాత్ తో ఇంటర్వూ

Posted: 05/06/2013 05:44 PM IST
Isha talwar exclusive interview

తెలుగు నాయికలు బాలీవుడ్‌ లేదా దక్షిణాది నుండి దిగుమతి కావడం పరిపాటే! మలయాళ చిత్రసీమ నుండి దిగుమతి అయిన ఉత్తరాది భామ ఇషా తల్వార్‌. గత ఏడాది మలయాళంలో రెండు సినిమాల్లో నటించి ఈ ఏడాది సెకండ్‌ హీరోయిన్‌గా తెలుగు సినీ అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌ దర్శకుడు వినోద్‌ తల్వార్‌ కూతురైన ఇషా తెరంగేట్రం నిజానికి 2000 సంవత్సరంలోనే జరిగింది. అనిల్‌కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ జంటగా వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘హమారా దిల్‌ ఆప్‌ కే పాస్‌ హై’ సినిమాలో హీరోయిన్‌ చెల్లెలుగా నటించిందీ చిన్నది. పన్నేండేళ్ల మలయాళం... అక్కడి నుండి సరాసరి తెలుగు తెరపై మెరిసింది. ఇటీవల విడుదలైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇషా తల్వార్‌ ఈవారం ‘అపరంజి’...

తెలుగు నటించిన తొలి చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఘన విజయం సాధించడంతో ఇక తెలుగు తెరపై తన సత్తా చాటుతానంటోంది ఇషా తల్వార్‌. తొలి చిత్రంతోనే తన అందాల ఆరబోతతో కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న ఈ ముంబాయి ముద్దుగుమ్మ తన తొలి ప్రయత్నంలోనే (బాలీవుడ్‌) హృతిక్‌ రోషన్‌ వంటి అగ్ర కథానాయకుడి సరసన డాన్స్‌లు చేసి, పలు ప్రతిష్టాత్మక బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహ రించి అందలాలను అందుకొంది. ఆ తరువాత బుల్లితెరపై కూడా ఓ సీరియల్‌లో నటించింది. ఇటీవలే విదులైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో హీరో నితిన్‌ సరసన రెండో హీరోయిన్‌గా నటించింది. తొలి చిత్రమే సూ పర్‌ హిట్‌ కావడంతో తనకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, హీరో నితిన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ముఖ్యంగా తనను తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఆరాధించినందుకు తెగ మురిసిపోతోంది.

తొలి అవకాశం...

ఇషా తల్వార్‌ నిజానికి హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసినా... పరోక్షంగా తెలుగు ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఎందుకంటే... వెంకటేష్‌, సౌందర్య హీరోహీరోయిన్లు వచ్చిన ‘పెళ్లిచేసుకుందాం’ సినిమా రిమేక్‌ అయిన ‘హమారా దిల్‌ ఆప్‌ కే పాస్‌ హై’ తన తొలి చిత్రం షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ చెల్లెలిగా నటించింది ఇషా తల్వార్‌. పుట్టి పెరిగింది ముంబయి. అక్కడే సెయింట్‌ జేవియర్స్‌ కళాశాల నుండి 2008 గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.

కేవలం నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా నిలదొక్కుకునేందుకు ప్రముఖ కథక్‌ డ్యాన్సర్‌ విజయశ్రీ చౌదరి వద్ద కథక్‌ నేర్చుకుంటోంది. అంతేకాదు... జాజ్‌, హిప్పాప్‌లో కూడా ఇషాకు ప్రవేశం ఉంది. వెండితెరకు పరిచయం కాకముందే వివిధ ఆల్బమ్స్‌లో బాలీవుడ్‌ ప్రముఖులతో ఆడిపాడిన అనుభవం ఈ ముద్దుగుమ్మ సొంతం. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఓ వీడియో ఆల్బంలో తానేంటో నిరూపించుకున్న ఇషా... బొమన్‌ ఇరానీ, షాహిద్‌ కపూ ర్‌, జాన్‌ అబ్రహం, కునాల్‌ వంటి వారితో కమర్షి యల్‌ యాడ్స్‌ నటించింది.

సెకండ్‌ రోలైనా ఓకే...

సినిమాలో ఇంతసేపు కనిపించాలి. సెలెక్టెడ్‌ క్యారెక్టర్స్‌ చేయాలి అని ప్రత్యేకమైన నిబంధనలేవీ పెట్టుకోని ఈ ఉత్తరాది భామ... కథ నచ్చి, పాత్రకు సరైన ప్రాముఖ్యత ఉంటే పాత్ర నిడివి గురించి ఆలోచించదట. సెకండ్‌ రోలైనా చేస్తానంటోంది.

కత్రినా - 2...

అచ్చుగుద్దినట్టు కాకపోయినా... ఇషాలో కత్రినా కైఫ్‌ పోలికలు ఉండడం ఆమె ప్లస్‌ పాయింటేనని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది నన్ను చూసిన ‘మీలో కత్రినా కైఫ్‌ పోలికలున్నాయని’ ప్రశంసిస్తున్నారంటూ తెగ మురిసిపోతోంది. తెలుగులో ముఖ్యంగా పూరీ జగన్నాధ్‌, శ్రీనువైట్ల, రాజమౌళి, సు రేందర్‌ రెడ్డి వంటి దర్శకులతో పనిచేయాలని ఉబలాటపడుతోంది. ఇక తె లుగు నిలదొక్కుకోవాలని డిసైడైనట్టుంది. అందుకే వీలు దొరికనప్పుడల్లా తె లుగు సినిమాలు చూస్తోం దట. తెలుగులో మీకు న చ్చిన సినిమాలేవంటే ‘పరుగు’, ‘ఒక్కడు’, ‘బొమ్మరిల్లు’ అని, ఇక హీరోల విషయానికి వస్తే... పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు అంటే ఎంతో ఇష్టమట. అంతేకాక, హీరోయిన్లు ఇలియానా, తమన్నా అంటే చాలా ఇష్టమట.

నితిన్‌తో...

తన తొలి తెలుగు హీరో నితిన్‌ తెగ పొగిడేస్తుంది ఇషా. ‘నితిన్‌ వెరీ గుడ్‌ ఆర్టిస్ట్‌. చాలా డెడికేటింగ్‌గా వర్క్‌ చేస్తాడు. మంచి డాన్సర్‌ కూడా. చాలా కంఫర్ట్‌గా అతనితో వర్క్‌ చేశా ను. ఎంటైర్‌ టీమ్‌ నాకు బాగా నచ్చింది’ అని ఇటీవల మీడియా ముందు తన తొలి సినిమా అనుభవాలు చెప్పుకుంది. హీరోయిన్‌ నిత్య మీనన్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాదు ఈ సినిమా చూసిన తన స్నేహితురాళ్లు అభినందించారట. ముఖ్యంగా బోనీకపూర్‌ స్వయంగా ఫోన్‌ చేసి విష్‌ చేయడం మరిచిపోలేనని చెబుతున్న ఇషా తల్వార్‌ తెలుగులో ముందుముందు ఎలా రెచ్చిపోతుందో చూడాలి మరి!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Feb 20 | కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింది చేస్తుండగా.. సీనియర్స్ ఒక జూనియర్ అమ్మాయిని ఈ విధంగా అడిగారు.  సీనియర్స్ : ‘‘మూడు బూతు మాటలు చెప్పు. నిన్ను వదిలేస్తాం’’ కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత... Read more