Snap deal sent wooden pieces in i phone 4s box

snap deal cheatings, snap deal articles rates, online shoping rates, i phone 4s online price, i phone 4s online booking, online shoping cheatings, online shoping offers, latest updates, i phone 4s review and ratings

snap deal sent wooden pieces in i phone 4s box : pune based kabra books i phone 4s in snap deal, he receives order box but instead of phones box contains wooden pieces placed

ఆన్ లైన్ షాపింగా.., అయితే ఇదే బెటర్

Posted: 12/15/2014 07:57 AM IST
Snap deal sent wooden pieces in i phone 4s box

ప్రస్తుత బిజీ లైఫ్ లో మనకు కనీసం షాపింగ్ చేసే సమయం కూడా ఉండటం లేదు. అంతా ఆన్ లైన్ మయం అయింది. మనకు తగ్గట్టే ఈ కామర్స్ సంస్థలు కూడా భారీ ఆఫర్లు ప్రకటించి కంప్యూటర్ ముందునుంచి కదలనివ్వటం లేదు. నచ్చింది కన్పిస్తే క్లిక్ చేయటం.., కార్డు నంబర్ తో డబ్బు కట్టేయటం నిమిషాల పని. రెండ్రోజుల తర్వాత కోరుకున్న వస్తువు మన ఇంటి దగ్గరకే వస్తుంది. కాని ఇక్కడే చిన్న ట్విస్టు ఉంది. మనం కోరుకున్న వస్తువుకు బదులు మరొకటి వస్తే.., అసలేమి రాకపోతే అప్పుడెలా.. బెంగళూరు వాసికి సరిగ్గా ఇలాగే జరిగింది.

పూణేకు చెందిన దర్శన్ కాబ్రా అనే వ్యక్తి ‘స్నాప్ డీల్’లో ఐ ఫోన్ 4ఎస్ మోడల్ రెండు బుక్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆర్డర్ ఇంటికి వచ్చింది. కలల ఫోన్ రావటంతో ఆగలేక డెలివరి బాయ్ ముందే తెరిచి చూసి ఖంగు తిన్నాడు. బాక్సులో ఐ ఫోన్లకు బదులు చెక్క ముక్కలు వచ్చాయట. ఇవి చూసేసరికి కాబ్రా మైండ్ బ్లాంక్ అయింది. అయితే కాబ్రా తొందరపాటే అతన్ని కాపాడింది. డెలివరి బాయ్ ఇంటి దగ్గరే ఉండటంతో ఫోన్ లేవని నిర్దారణ అయింది. దీంతో పాటు బాధితుడు క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ ఎంపిక చేయటంతో.., వస్తువులు రాలేదు కాబట్టి డబ్బులు చెల్లించను అని తెగేసి చెప్పాడు.

క్యాష్ ఆన్ డెలివరి కాకుండా ముందే చెల్లించి ఉంటే రూ.40,508 రూపాయలు నష్టపోయేవాడినని దర్శన్ వాపోయాడు. కాబట్టి ఆన్ లైన్ షాపింగ్ అంటే క్యాష్ ఆన్ డెలివరినే బెటర్ అని ఈ ఘటన ఉదహరిస్తోంది. అంతేకాకుండా అన్ లైన్ షాపింగ్ లో ఇలా కూడా జరుగుతుందని హెచ్చరిస్తోంది. కాబట్టి ఆన్ లైన్ షాపింగ్ కాస్త తగ్గించుకుని.., రోడ్డుపైకి వెళ్తే బోలెడు మాల్స్, షాపులు ఉంటాయి. వెంటనే డబ్బు కట్టేయవచ్చు, నచ్చిన వస్తువు తెచ్చేసుకోవచ్చు. అలా కాదు అంటే.., అప్పుడప్పుడూ ఇలా రిస్క్ పడక తప్పదు.
క్యాష్ ఆన్ డెలివరి కావటంతో..,

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snap deal shopping  i phone 4s latest  online shopping cheatings  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more