Dwarampudi chandrasekhar reddy criticised pawan kalyan

Dwarampudi Chandrasekhar Reddy, Pawan Kalyan, YSRCP, Chandrababu

dwarampudi chandrasekhar reddy criticised pawan kalyan

అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించరేంటండీ..

Posted: 09/24/2014 04:57 PM IST
Dwarampudi chandrasekhar reddy criticised pawan kalyan

ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తాను.. అవసరమైతే నిలదీస్తాను అంటూ భావోద్వేగంతో ప్రసంగం చేసిన సినీనటుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రజలు అడుగుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.  తమకు అన్యాయం జరుగుతుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పవన్ కళ్యాణ్ కు కనిపించడం, వినిపించడం లేదా అంటటూ నిలదీశారు. ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న ఆయన ఎన్నికలు ముగిసిన తరువాత ఈ రోజు వరకు కనిపించడం లేదని విమర్శంచారు.  కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజలు తమ పక్షాన నిలిచే నేతలకే ఓట్ల వేయాలని, చుట్టం చూపుగా వచ్చే నేతల మాటలను విశ్వసించరాదని ద్వారంపూడి అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dwarampudi Chandrasekhar Reddy  Pawan Kalyan  YSRCP  Chandrababu  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more