మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, మహానటుడు ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మాత్రమే సరితూగ గలుగుతుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఎన్టీయార్ తో నాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు రాజకీయాలపై అవగాహన వచ్చిందని, ఆయన పిలుపుతోనే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయ అవగాహన వచ్చిందని ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఒక రాష్ట్రంలోని ప్రజలలో సమూల మార్పులకు కారణమైన ఎన్టీయార్ కు భారత రత్న అవార్డును ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
భారతరత్నకు ఎన్టీఆర్ పేరును సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అత్యున్నత పౌరపురస్కారం అందుకోడానికి ఎన్టీఆర్‌కున్న అర్హతలను వర్ణిస్తూ ఏడుపేజీల వర్ణచిత్ర పుస్తకాన్ని జతచేసింది. తల్లిపక్కన కూర్చున్న బాలరాముడు వెండితెర శ్రీరాముడిగా ఎదిగిన క్రమంతో ముగించారు. చివరి పేజీలో లవకుశలోని శ్రీరామచంద్రుడి చిత్రాన్ని ముద్రించారు. ప్రతి పేజీలో ఆయన ఎదిగిన క్రమాన్ని కళ్లకు కట్టారు. యుక్తవయస్సునాటి స్ఫురద్రూపం నుంచి జాతీయ రాజకీయనేతగా ఎదిగిన క్రమం వరకూ అన్ని దశలనూ పొందుపరిచారు. తల్లి వెంకటరావమ్మ, అర్ధాంగి బసవతారకంతో ఉన్న చిత్రాలను ప్రత్యేకంగా ముద్రించారు. జనసముద్రాల్లాంటి బహిరంగసభలను ఉద్దేశిస్తూ చేస్తున్న ప్రసంగాలు, వాజ్‌పేయి, వీపీసింగ్, కరుణానిధి, ఎస్ఆర్ బొమ్మైలాంటివారితో కలిసి జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్రకు అద్దంపట్టే ఘట్టాలను ఆవిష్కరించారు.
మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజంలోని ప్రతివర్గంలో వెలుగులు నింపిన ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడమే నిజమైన నివాళి అని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. 'సమాజంపట్ల ఆయనకున్న దయ, సంవేదన, వినయం, అవగాహన, జాతికి ఆయన అందించిన సుదృఢ నాయకత్వానికి భారతరత్న ప్రకటించడమే అసలైన నివాళి' అని పేర్కొంది. చమత్కారం, విజ్ఞానం మేళవించిన వాగ్దాటితో ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన వాచస్పతి అని పేర్కొంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన ప్రజానాయకుడని గుర్తు చేసింది. అడుగుపెట్టిన ప్రతిరంగంలో అగ్రతాంబూలాన్ని దక్కించుకున్న యోధుడని కీర్తించింది. సినీ రంగంలోనూ అగ్రగణ్యుడని గుర్తు చేసింది. 'తన విశాల దృక్పథాన్ని అన్నివర్గాల ప్రజలకూ సమర్థంగా చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్‌కే సొంతం. మతసామరస్యం, జాతిసమగ్రతకోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీయార్ అని వివరించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more