Jaggareddy warns harish rao

jaggareddy, harish rao, bjp persons, warning, see end

jaggareddy warns harish rao.. states not to touch bjp persons

హరీష్.. నీ అంతు చూస్తా..

Posted: 09/12/2014 11:26 AM IST
Jaggareddy warns harish rao

మెదక్ జిల్లాలో బిజేపీ శ్రేణులు, కార్యకర్తల జోలికి వస్తే మంత్రి హరీశ్‌రావు.. నీ అంతు చూస్తా... నీ గుండెల్లో నేను నిద్రపోతా.. అంటూ బీజేపి మెదక్ లోక్ సభ అభ్యర్థి జగ్గారెడ్డి తీవ్ర అగ్రహంతో ధ్వజమెత్తారు. అంతేకాదు.. బీజేపి శ్రేణుల జోలికి వస్తే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ నిప్పుటు చెరిగారు. సంగారెడ్డిలో బీజేపి ఎన్నికల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. 'తెలిసో తెలియకో.. కేసీఆర్ మాటలు నమ్మి మొన్నటి ఎన్నికల్లో నన్ను ఓడగొట్టారు? ఈసారి ఉప ఎన్నికలో సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మెజార్టీ ఇవ్వాల'ని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా-తెదేపా ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

జిల్లాకు సాగు, తాగునీరు అందించి రైతాంగ అభ్యున్నతికి తోడ్సాటును అందిస్తానన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డికి మెట్రో రైలు తీసుకొస్తానని మెదక్ జిల్లా ఓటర్లకు ఆయన హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిపిస్తే ప్రధానమంత్రి మోడీని నియోజకవర్గానికి తీసుకొస్తానన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనను ఎలాగైనా గెలిపించాలని ఆయన విన్నవించారు. తనను గెలిపిస్తే నిత్యం పప్పు బెల్లాలను అందిస్తానని చెప్పారు. లేని పక్షంలో సంగారెడ్డి ప్రజలకు కనిపించకుండా వెళ్లిపోతానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaggareddy  harish rao  warning  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more