Murder attempt in nalgonda district

nalgonda district, kondamadugu, latest news, knives, murders, rapes, attempt to murders, crimes, crimes in india, hyderabad, telangana, police, wakf lands, wakf , relatives, attacks, national highway, national highway 9, secundrabad, rain bazar`

a gang attacked wakf lands supervisor in nalgonda with knives and rods : wakf lands supervisor attemptd to murder in nalgonda district on national highway

అంతా చూస్తుండగా వేటకొడవళ్లతో దాడి

Posted: 09/11/2014 09:48 AM IST
Murder attempt in nalgonda district


నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే వేటకొడవళ్లతో హత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. వక్ఫ్ భూ సంరక్షకుడిపై ఓ వ్యక్తి అనుచరులు వేటకొడవళ్ళతో దాడిచేయగా అతను తీవ్రగాయాలపాలయ్యాడు. జిల్లాలోని కొండమండుగు గ్రామానికి చెందిన సయ్యద్ స్థానిక వక్ఫ్ భూముల సంరక్షకుడుగా ఉన్నాడు. గ్రమాంలో భూముల విషయంలో దగ్గరి బంధువైన మక్బూల్ తో విభేదాలు తలెత్తాయి. దీంతో సయ్యద్ పై మక్బూల్ కక్ష్య పెంచుకున్నాడు.

కొద్దికాలంగా హైదరాబాద్ లోని రెయిన్ బజార్ లో ఉంటున్న సయ్యద్, బుధవారం గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మక్బూల్ భూమి విషయమై మళ్లీ గొడవపడ్డాడు. ఊరినుంచి తిరిగి వెళ్తూ జాతీయ రహదారపై ఉన్న హోటల్ లో సయ్యద్ బోజనం చేస్తుండగా.., ఒక్కసారిగా మక్భూల్ అనుచరులు వేటకొడవళ్ళతో దాడి చేశారు. దీంతో సయ్యద్ పెద్దగా కేకలు పెట్టాడు. ఇది గమనించిన హోటల్ సిబ్బంది, ఇతరులు అప్రమత్తం కావటంతో దుండగులు పారిపోయారు. అంబులెన్స్ కు ఫోన్ చేసిన స్థానికులు సయ్యద్ ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలిసులు విచారణ చేపట్టారు. మరోవైపు సయ్యద్ పై హత్యాయత్నం చేసినట్లు బీబీనగర్ పోలిస్ స్టేషన్ కు మక్బూల్ స్వయంగా వచ్చి లొంగిపోయాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wakf lands  murder attempt  nalgonda  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more