Strong earthquake shakes in indonesia

indonesia, earthquake, indonesia earthquake, world earthquakes, thailand, malaysia, latest news, world news, rains, landslindes, how earthquakes happen, islands, coastal

massive earthquake shaked indonesia on wednesday with 6.5 magnitude : people of indonesia shivered by strong earthquake runs from homes

వణికిన దీవులు.. దేవుడా! అంటూ ప్రజల పరుగులు

Posted: 09/10/2014 05:34 PM IST
Strong earthquake shakes in indonesia

భారీ భూకంపం ఇండోనేషియాను వణికించింది. బుధవారం తూర్పు తీరంలో భూమి కంపించిది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదయింది. సులవేశి ద్వీపంలో సంభవించిన భూకంపం పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. సముద్రతీరంలో భూమి కంపించటంతో సునామి వస్తుందని అంతా భయపడ్డారు. అయితే ఎలాంటి సునామి హెచ్చరికలు నమోదు కాలేదని ఇండోనేషియా ఉన్నతాధికారులు తెలిపారు. సులవేశిలోని ద్వీపంలోని మండేయాంగ్ ప్రాంతంలో భూమిలో 22కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ప్రకంపణలతో వణికిపోయిన ఇండోనేషియా ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అటు కార్యాలయాల్లో కూడా ప్రకంపణలు రావటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యోగులంతా రోడ్లపైకి పరుగులు మొదలు పెట్టారు. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది. తరుచుగా భూ కంపాలు సంభవించే ప్రాంతమే అయినా.., ప్రకంపనాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంతా భయపడ్డారు. అయితే సునామి హెచ్చరికలు లేకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 2004సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో సముద్రంలో వచ్చిన భారీ భూకంపం సునామిలా మారి పన్నెండు దేశాలను అతలాకుతలం చేసింది. ప్రకృతి కన్నెర్రజేస్తే 2,30,000మంది ప్రజలు బలయ్యారు. పదేళ్ళవుతున్నా నాటి దుర్ఘటనను ఇంకా ఎవరూ మరువేలకపోతున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indonesia  earthquake  islands  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more