Yanamala rakakrishnudu finally gives clarification on ap students fees reimbursement

ap finance minister yanamala ramakrishnudu, yanamala ramakrishnudu news, yanamala ramakrishnudu press meet, fees reimbursement issues, ap students, telangana students

yanamala rakakrishnudu finally gives clarification on ap students fees reimbursement

హమ్మయ్యా.. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయం తేలిపోయింది!

Posted: 08/27/2014 01:49 PM IST
Yanamala rakakrishnudu finally gives clarification on ap students fees reimbursement

విభజన అనంతరం నుంచి కేసీఆర్ అమలు చేసిన విధానాల ప్రకారం... తెలంగాణాలో ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించేది లేదని ప్రకటించిన నేపథ్యంలో ఎంత పెద్ద దుమారం రేగిందో అందరికీ తెలిసిందే! ఈ విషయం మీద దాదాపు మూడునెలలపాటు చర్చలు జరిగాయి. అటు కేసీఆర్ 1956 స్థానికత వున్నవారికి తప్ప మిగతావాళ్లకు ఫీజు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఆంధ్రామంత్రులు ఆందోళనల్లో మునిగిపోయారు. ఒకవైపు ఆంధ్రరాష్ట్రంలో చాలా లోపాలున్న నేపథ్యంలో ఈ సమస్య వారికి మరిన్ని చిక్కుల్లో పడిపోయింది. ఏపీ విద్యార్థులు కూడా తమకు ఎవరో ఒకరు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ దీనపరిస్థితిలో వుండిపోయారు. చివరగా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఒక స్పష్టతను ప్రకటించేసింది.

ఏపీ ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించని పక్షంలో వారి బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకుని ఫీజు రాయితీ కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇకనుంచి ఆంధ్రావిద్యార్థులు ఫీజు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. విభజనకు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రాయితీకి మొత్తం 2వేల కోట్లు ఖర్చు అయ్యిందని పేర్కొన్న ఆయన... అందులో ఆంధ్రా వాటా ఎంతుందో ఇంకా తెలియారాలేదని అన్నారు. తెలంగాణాలో సీమాంధ్ర విద్యార్థులు ఎంతమందున్నారో త్వరలోనే లెక్కతేల్చి.. వారికి అందాల్సిన రాయితీని త్వరలోనే ఏర్పాటు చేసే దిశలో ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yanamala ramakrishnudu  tdp government  tdp party  ap students  fees reimbursement  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more