Rice bucket challange getting popular

rice bucket challange, challange, ice bucket challange, rice, poor people, manju latha kalanidhi, participants, hyderabad, warangal, latest news, telangana, facebook, social media

rice bucket challenege become very popular in social media started by manjulatha kalanidhi : manjulatha's rice bucket challange caused for rice donation to poor people become popular

ఇప్పుడిక రైస్ బకెట్ చాలెంజ్

Posted: 08/24/2014 06:10 PM IST
Rice bucket challange getting popular

ప్రపంచ వ్యాప్తంగా అంతా ఐస్ బకెట్ చాలెంజ్ ఫీవర్ నడుస్తోంది. అయితే హైదరాబాద్ లో ప్రారంభమైన రైస్ బకెట్ చాలెంజ్ దీనికి ధీటైన పోటి ఇస్తోంది. ఒక తెలుగు మహిళ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ పోటి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. పేదలకు తిండి పెట్టాలనే సదుద్దేశంతో ప్రారంభమైన ఈ చాలెంజ్ కు మంచి స్పందన వస్తోంది. పేదలకు ఎవరైతే అన్నం పెట్టాలి అనుకుంటున్నారో వారు రైస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొనవచ్చు అని చెప్తున్నారు చాలెంజ్ సృష్టికర్త మంజు లతా కళానిధి. సోషల్ మీడియా ద్వారా సామాజిక ఉద్యమాన్ని ప్రారంభిచిన మంజు.., తన వంతుగా బియ్యాన్ని పంపిణీ చేసి ఫేస్ బుక్ లో ప్రపంచానికి సవాల్ విసిరింది. మీరు చేసి చూపించండి అని ఛాలెంజ్ చేస్తుంది.

మంజు పిలుపుకు మంచి స్పందన వస్తోంది. ఎంతోమంది దానగుణం కలిగిన వారు రైస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొని వారికి తోచినంత సాయం చేస్తున్నారు. డబ్బు, బియ్యం రూపంలో మంజు నిధికి పంపుతున్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడంతో పాటు వారికి వచ్చే రోగాలకు మందులు సమకూర్చడమే తన ఉద్దేశ్యం అని మంజు లతా చెప్తున్నారు. రోజూ ఎంతోమంది పేదలు కడుపు కాలి కాలం వెల్లదీస్తున్నారు. వారికి కనీస అవసరమైన తిండిని మనం అందించగలిగితే చాలు అని చెప్తుందామె.

సొంతంగా ఆహారం తయారు చేసి కానీ.., కొని అయినా సరే రైస్ బకెట్ చాలెంజ్ లోపాల్గొనవచ్చని చెప్తోంది. అయితే రోగులకు సాయం చేయాలనుకుంటే మాత్రం ఒక్కొక్కరూ రూ. 100కి తక్కువ కాకుండా సాయం చేయవచ్చని చెప్తోంది. తనతో కలిసి వచ్చే చేతులను బట్టే మనలో ఎంతమందికి సామాజిక స్పృహ ఉందో అర్ధం చేసుకోవచ్చని సవాల్ విసురుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన ఈ ఉద్యమం.., మరింత విస్తరించి పేదరికాన్ని నిర్మూలించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ రైస్ బకెట్ చాలెంజర్స్.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rice bucket challange  manju latha kalanidhi  latest news  poor  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more