కేంద్ర హోంమంత్రి, బీజేపి మాజి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారాయన. అకస్మాత్తుగా గత రాత్రి కడుపునొప్పి వచ్చింది. వెంటనే స్పందించిన సన్నిహితులు హోంమంత్రిని హుటాహుటిని అత్యాధునిక సౌకర్యాలుండే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు హోంమంత్రికి చికిత్స చేశారు. పలు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. కీలకమైన న్యాయమూర్తుల నియామక బిల్లుపై చర్చ కోసం ఇవాళ పార్లమెంటుకు ఆయన హాజరుకావాల్సి ఉంది. దీంతో వైద్య పరీక్షలన్ని గత రాత్రే పూర్తి చేశారు. అంతేకాదు ఉదయం సమయంలో అయితే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశ్యంతో రద్దీ తక్కువగా ఉండే రాత్రి సమయంలో పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్ నాధ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో రాష్ట్రస్థయిలో వివిధ పోస్టులను సమర్ధంగా నిర్వహించటంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడుగా కూడా బాద్యతలు నిర్వర్తించారు. ఈ ధఫా ఎన్నికల్లో బీజేపి గెలవటంతో.., ఎన్డీయే ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారు. కీలకమైన బిల్లులు రూపకల్పనలో మోడి రాజ్ నాధ్ సలహాలు తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై ఆయన దృష్టిపెట్టారు. సర్వే వివరాలు, సర్వే పత్రం, ఎందుకోసం చేస్తున్నారో సమగ్ర సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మత ఘర్షణలు జరుగుతుండే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినప్పటికీ రాజ్ నాధ్ పై ఆ ముద్ర ప్రభావం అంతగా లేదనే చెప్పాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more