Kcr for accusing modi gif

telangana, kishan reddy, kcr, bjp, modi, governor special powers on hyderabad, hyderabad, asaduddin owaisi, mim party, old city, latest news

kishan reddy fires on kcr for accusing modi on governor powers : kishan reddy says nda only implementing telangana bill rules not responsible for the decisions made in upa

మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ రిమోట్

Posted: 08/12/2014 01:05 PM IST
Kcr for accusing modi gif

గవర్నర్ అధికారాల విషయంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై తెలంగాణ బీజేపి అద్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణ బిల్లులో రూపొందిచిన ఏ అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చలేదన్నారు. బిల్లు యధాతధంగా అమలు చేస్తోంది తప్ప ప్రత్యేక ఉద్దేశ్యం ఏమి లేదన్నారు. మోడీపై విమర్శలు చేసే తెలంగాణ ముఖ్యమంత్రి బిల్లు పాసయినప్పుడు గవర్నర్ అధికారాలపై ఎందుకు నోరు మెదపలేదన్నారు.

తెలంగాణ రావటంలో బీజేపీది ముఖ్యమైన పాత్ర అనే విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్ఎస్ కలిసి వచ్చినా రాకపోయినా ఉద్యమం కొనసాగించటంతో పాటు పార్లమెంటులో బిల్లు పెట్టేలా పట్టుబట్టింది తమ నేతలే అని స్పష్టం చేశారు. ఇది మరిచిపోయి తమపై విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. స్వప్రయోజనాల కోసం బీజేపిపై కేసీఆర్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో పనిచేస్తూ.., ఆ పార్టీ ఆడించినట్లు కేసీఆర్ ఆడుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

కారు రిమోట్ మజ్లస్ చేతిలో

తెలంగాణ ఏర్పడటంలో మజ్లిస్ ఎంత కీలక పాత్ర వహించలేదో అందరికీ తెలుసు. తెలంగాణకు మద్దతివ్వటంతో ఎప్పుడూ వెనకే ఉన్న ఈ పార్టీ రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రభావం చూపుతోంది. ఇందుకు ఉత్తమ ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వ చిహ్నం. అందులో ముందుగా కాకతీయ తోరణం, అమరుల స్థూపం ఉంచాలని భావించారు. అయితే అసదుద్దీన్ చర్చలు జరపటంతో అప్పటికప్పుడు అమరూల స్థూపాన్ని పక్కనబెట్టి చార్మినార్ ను చేర్చారు. ఈ ఒక్కటే కాదు హైదరాబాద్ భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని కూల్చివేతలు మొదలు పెట్టిన ప్రభుత్వం పాతబస్తీలో కనీసం ఇటుకను కూడా కదిలించటం లేదు. ఇందుకు అధికారిక కారణమేంటో తెలియదు. కాని అంతరార్ధం అందరికి తెలుసు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  kishan reddy  modi  asaduddin owaisi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more