Dubai boston flight escapes from accident all safe

ght accidents, dubai boston flight, world latest news, emirates, boing flights

dubai boston flight get out from accident : flight landed safely in london all passengers safe

పెను ప్రమాదమే తప్పింది

Posted: 08/11/2014 10:29 AM IST
Dubai boston flight escapes from accident all safe

విమాన ప్రయాణమంటేనే ఈ మద్య అందరికీ వెన్నులో వణుకుపుడుతోంది. ఏళ్ళుగా దేశాలు చుడుతున్నవారికైనా సరే.., గాల్లో ప్రయాణమంటే తమ జీవితం గాలిలో దీపంలా మారుతుందని భయపడుతున్నారు. వరుస ప్రమాదాలు ప్రయాణికులనే కాదు విమాన సంస్థలు, సిబ్బందిని కూడా భయపెడుతున్నాయి.

దుబాయ్ నుంచి బోస్టన్ వెళ్తున్న విమానం ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎమిరేట్స్ బోయింగ్ 777-300 విమానం బోస్టన్ కు బయల్దేరింది. టేకాఫ్ బాగానే జరిగింది. ప్రయాణం కొద్ది సేపు సాఫీగా సాగిపోయింది.  అయితే మద్యలో లండన్ లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. విమానం కిందకు దిగే సమయంలో ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇంకేముంది ఏదో జరిగిపోతుందని అంతా భయపడ్డారు. ప్రయాణికులు తమ వారిని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టారు. తమకేమీ కావద్దని ప్రార్ధనలు చేశారు. ఎవరి ప్రార్ధన ఫలమో కానీ.., ఎయిర్ పోర్టులోని సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.

దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చావు అంచుల దాకా వెళ్ళి వచ్చామురా దేవుడా అనుకున్నారు. బ్రతుకు జీవుడా అని బయటకు వచ్చారు.

ప్రమాదం నుంచి బయటపడ్డ విమానంలో మొత్తం 349మంది ప్రయాణికులు, 18మంది సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని ప్రకటించారు.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dubai boston  flight accident  boing  london  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more