Tenth class pankaj parakh golden shirt got place in guinness book of world records

tenth class man pankaj parakh, pankaj parakh latest news, golden shirt man, golden shirt man guinness book, guinness book of world records

tenth class pankaj parakh golden got place in guinness book of world records : A mumbai man pankaj parakh got place in guinness book of world records and limca book of records by wearing a golden shirt word 1 crores 30 lakhs who didn't completed even tenth class

పది పాస్ కాకపోయినా.. పసిడికి రారాజు!

Posted: 08/06/2014 04:36 PM IST
Tenth class pankaj parakh golden shirt got place in guinness book of world records

ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ప్రముఖ దిగ్గజాలుగా వెలిగిపోతున్న వారందరు సైతం ఎదుర్కోవడానికి నానాతంటాలు పడుతూనే వుంటారు. మరోవైపు ఉన్నతస్థాయి చదువుల పట్టాలను పొందిన విద్యార్థులు ఉద్యోగాలు దొరక్క విలవిలలాడిపోతున్నారు. ఇంకోపక్క ధరలు చుక్కలంటుతున్న నేటి తరుణంలో తినడానికి, వేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి కావాలసిన వస్తువులను కొనుగోలు చేయాలంటేనే పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి! కానీ కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని ఒక వ్యక్తి వీరందరికీ ధీటుగా నిలబడుతూ నేడు పసిడికే రారాజుగా మారిపోయాడు.

ముంబై నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో వున్న యోలాలోని నివాసం వుండే పంకజ్ పరాఖ్ అనే వ్యక్తి కథ ఇది! ఇతనికి కనీసం విద్యార్హత పదవ తరగతి కూడా లేదు. చిన్నప్పుడు ఎన్నో అష్టకష్టాలు పడి దాటిపెట్టుకున్న డబ్బులను కూడబెట్టుకుంటూ చివరికి దుస్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అంతే! అక్కడి నుంచి మొదలైన ఆ వ్యక్తి ఎదుగుదల.. ఎదుగుతూ ఎదుగుతూ ఇప్పుడు బంగారు చొక్కనను ధరించుకునే స్థాయికి ఎదిగిపోయాడు. బంగారం పూతతో దాదాపు నాలుగు కిలోల బరువు చొక్కాను ధరించి.. అందరినీ ఆకట్టుకున్నాడు. దాని ఖరీదు అక్షరాలా కోటీ 30 లక్షల రూపాయలు.

గత శుక్రవారంనాడు తన 45వ జన్మదిన వేడుకల సందర్భంగా పంకజ్ ఇలా బంగారు పూతతో వున్న ఖద్దరు డ్రెస్సును ధరించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆప్ రికార్డులోకి చేరిపోయాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యక్తి జన్మదిన వేడుకలకు హాజరైన ముఖ్య అథితుల జాబితా కూడా ఘనంగా వుంది. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఛగన్ భుజ్ భల్, ఓ డజను ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు తరలివచ్చారు. డబ్బు సంపాదించడానికి చదువొక్కటే మార్గం కాదు... అందుకు సరైన తెలివిని ఉపయోగించుకోవాలి అనే మాటకు నిదర్శనంగా ఈ వ్యక్తి నేడు భారతపౌరులకు నిలిచాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more