What is cm kcr and ministers nativity tdp

KCR, Telangana ministers nativity, 1956 telangana rule, Telangana nativity, Hyderabad nativity

TDP asks to determine first CM KCR and Telangana ministers nativity

ముందుగా సి.ఎమ్.,మంత్రులు స్థానికత నిర్ధారించాలి

Posted: 08/01/2014 08:20 AM IST
What is cm kcr and ministers nativity tdp

విద్యార్ధుల స్థానికతపై తెలంగాణ టిడిపి తీవ్రంగా ధ్వజమెత్తింది. విద్యార్ధుల స్థానికతను రవెన్యూ అదికారులు నిర్దారించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, ముందుగా ముఖ్యమంత్రి, మంత్రుల స్థానికతను నిర్దారించాలని ఆ పార్టీ అదికార ప్రతినిధి నన్నూరి నరిసిరెడ్డి అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినప్పుడు కెసిఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిదానిని వివాదం చేస్తూ సెంటిమెంటును వాడుకో చూస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణలో పుట్టిన ప్రతివాడు తెలంగాణ వ్యక్తే అవుతారని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో కోటిమంది కొత్తవారే
స్థానికతను 1956ను ప్రామాణికంగా నిర్ణయించడంలో హేతుబద్ధతను చంద్రబాబు ప్రశ్నించారు. ''మహారాష్ట్ర, కర్ణాటకతోసహా ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 50 ఏళ్ల కిందట భద్రాచలం ఎక్కడుంది? వారికి స్థానికత సర్టిఫికెట్‌ ఎలా ఇస్తారు? 1956లో హైదరాబాద్‌లో కేవలం 11 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కోటీ 10 లక్షల మంది ఉన్నారు. వారంతా పన్నులు చెల్లించడంలేదా? వారి సంక్షేమం అక్కరలేదా?'' అని నిలదీశారు. హైదరాబాద్‌కున్న ఇమేజ్‌పోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఫాస్ట్‌' పథకానికి తమిళనాడు తరహా 'స్థానికత'ను ప్రాతిపదికగా తీసుకోవాలని కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత కుందూరు జానారెడ్డి సూచించారు. 1956 కంటే ముందు నుంచి ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తామంటే... తెలంగాణ విద్యార్థులకు సైతం కష్టమవుతుందని చెప్పారు. ఫీజుల రీ-యింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ అనేది రిజర్వేషన్‌ సిస్టం కాదని, చట్టబద్ధత వర్తించదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more