Low opinion on politicians

chandrababu mlas class, low opinion on politicians, mlas behavior in assembly, people lost interest in assembly sessions, chandrababu calls for mlas honesty

low opinion on politicians should be removed from the minds of the people chandrababu naidu says

రాజకీయ నాయకుల మీద చులకనభావం!

Posted: 07/18/2014 05:52 PM IST
Low opinion on politicians

రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వ కార్యాలయాల మీద సామాన్య ప్రజలకు ఒక రకమైన చులకన భావం ఉన్న విషయం సత్యం.  కేవలం డబ్బు సంపాదించటమే ధ్యేయంగా రాజకీయాలలోకి వచ్చి అవినీతికి ఒడిగడుతూ ఉంటారని, చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతనుండదని, ప్రజా సంక్షేమం పట్టదని, తమ సీట్లను కాపాడుకోవటమే లక్ష్యంగా పనిచేస్తుంటారని, ఏం మాట్లాడినా, ఏం చేసినా అన్నిటిలోనూ అన్నివేళలా రాజకీయ నాయకులు చూసేది రాజకీయ ప్రయోజనమే తప్ప మరేమీ ఉండదని సామాన్యంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం.

దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా అర్థం చేసుకోవటమే కాకుండా ఆ ముద్రను తుడిచివెయ్యాలని కూడా సంకల్పం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.  ఎమ్మెల్యేల శిక్షణా శిబిరంలో మాట్లాడిన చంద్రబాబు, టివిల్లో అసెంబ్లీ సమావేశాలను చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని, ఆ పరిస్థితి మారాలని, రాజకీయాలంటే ప్రజలలో గౌరవం పెరగాలని, అది మన ప్రవర్తనతోనే వస్తుందని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ సభ్యులకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇదేవిధంగా విషయావగాహన చేసుకోవాలని, పార్లమెంట్ సమయాన్ని వృధా
చెయ్యకుండా సరైన విధానంలో చర్చలు సాగించాలని కోరారు.  అలాగే చంద్రబాబు కూడా చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలుండాలని, అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలని అన్నారు.  

శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేస్తూ అధికారపక్షం, ప్రతిపక్షమనే తేడా లేకుండా అభివృద్ధి పథంలో ముందుకెళ్దామన్న చంద్రబాబు, పేదరికం లేని సమాజం కోసం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more