సమాచార హక్కు చట్టం పుణ్యామా అని బయటకు రాని ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని సమాజసేవకురాలు ఊర్వశి శర్మ సహ చట్టం ద్వారా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గురించి తీసుకున్న కొన్ని వివరాలు మహళలకు వ్యతిరేకంగా ఎంత వివక్ష చూపిస్తున్నారన్నది అర్థమౌతోంది. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటికే ఆయన తండ్రి ములాయమ్ సింగ్ రేపిస్ట్ ల మీద చేసిన వ్యాఖ్యలు, వెలుగు చూసిన అత్యాచారాలతో దేశమంతా వ్యతిరేకత కనపడుతోంది. రేప్ లు పిల్లలు కాకపోతే మరెవరు చేస్తారు, అందుకోసం వాళ్ళని ఉరితీస్తామా అంటారు ములాయమ్ సింగ్ యాదవ్. అందరికీ మా రాష్టంలో నేరాలే కనిపిస్తాయే, మరెక్కడా రేప్ లు జరగటం లేదా అంటారు అఖిలేష్ యాదవ్. కానీ మరోపక్క మహిళలంటే గౌరవమని, వారి భద్రతకోసం ఏమైనా చేస్తామని కూడా ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అదికారులందరూ ఏకకంఠంతో చెప్తారు.
ఇంతకీ సహ చట్టం ద్వారా తీసుకున్న వివరాలు ఏం చెప్తున్నాయంటే, స్టేట్ ఉమెన్స్ కమిషన్ కి కేటాయిస్తూ వస్తున్న నిధులను మరీ దారుణంగా తగ్గించేసారు. 2011-12 లో కేటాయించింది రూ. 5.1 కోట్లైతే 2012-13 లో కేటాయించిన మొత్తం రూ.4.16 కోట్లు. అందులో రూ.3.9 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టటం జరిగింది. 2013-14 లో ఏకంగా కేటాయింపును 85 శాతం తగ్గిస్తూ, రూ.75 లక్షలు చేసారు.
అయితే, ఇది ఆర్థిక సమస్యను అధిగమించటానికని అనుకుంటే, అఖిలేష్ యాదవ్ కోసం రెండు 7 సీటర్ మెర్సిడెజ్, రెండు ల్యాండ్ క్రూయిజర్లను కొనటానికైతే డబ్బులున్నాయి. ఈ సమయంలో అఖిలేష్ యాదవ్ కుటుంబ సమేతంగా లండన్ విలాసయాత్రలో ఉన్నారు.
ఈ సమాచారాన్ని చూసిన మరో మహిళా హక్కుల పోరాటం చేసే నీలం రంజన్ దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ, సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడూ ఇంతే, మహిళా స్వేచ్ఛ గురించి వాళ్ళ రికార్డ్ ఇలాగే ఉంటుంది అన్నారు. ముందు దిగ్భ్రాంతికి గురైనా, రేప్ లంటే సామాన్యమని చెప్తూ, బాధితులను పరామర్శించటానికి కూడా ఇష్టపడని, ప్రతి మహిళకు ఒక గన్ మెన్ ని భద్రత కోసం నియమిస్తామా ఏమిటి అని ప్రశ్నించే పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇంతకంటే ఏమాశించగలంలే అన్నారు.
భాజపా అధికార ప్రతినిధి విజయ్ బహాదుర్ పాఠక్ మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నారు. బహుజన సమాజ్ వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం విషయంలో దృష్టి ఎప్పుడూ మరలుస్తుంది అన్నారు.
అందిన సమాచారాన్ని బట్టి చూస్తేనే రాష్ట్రంలో రోజుకి 5 రేప్ లు జరుగుతున్నాయి. కానీ అవన్నీ మామూలే అన్నట్లుగా తేలిగ్గా తీసుకుంటున్నారు అధికారులు అన్న ఊర్వశి శర్మ, పూర్వాంచల్, బుందేల్ ఖండ్ లాంటి సుదూర ప్రాంతాలలో మహిళలకు రక్షణ అసలే లేదంటూ విచారాన్ని వ్యక్తపరచారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more