ప్రస్తుతకాలంలో మన భారతదేశంలో మహిళలపై రానురాను అరాచకాలు మరీ దారుణంగా పెరిగిపోతున్నాయి. అమ్మాయి ఇంటినుంచి బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తుందో, రాదోనన్న భయంతో తల్లిదండ్రులు ఆందోళనల్లో మునిగిపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరూ, ఎలా వచ్చి తమ అమ్మాయిల్ని తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తారోనన్న భయం కూతురున్న ప్రతి తల్లిదండ్రుల్లో పుట్టుకొస్తోంది. ఆఖరికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇటువంటి అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా యూపీలోని పోలీస్ శాఖలో జరిగిన మరో విషాదం!
యూపీలోని పోలీస్ శాఖలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారిపై డీఐజీ స్థాయి అయిన ఒక ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆమె తన పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు మాత్రం ఆ అధికారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా, ఈమెనే భయపెట్టి అక్కడి నుంచి తరిమేశారు. న్యాయపోరాటం కోసం పాట్లుపడుతూ... పై అధికారులకు సలామ్ లు చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఆమెకు ఫలితం మాత్రం దక్కలేదు. పైగా అతని వేధింపులు రానురాను మరీ మితిమీరిపోతున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో వున్న ఆ మహిళా అధికారి చివరికీ ఫేస్ బుక్ ని ఆశ్రయించి, నాకు న్యాయం జరిగేలా సహాయం చేయండూ అంటూ తన గోడును చెప్పుకుంది.
తన బ్యాచ్ లో శిక్షణలో టాపర్ గా నిలిచిన ఆమె, ఫేస్ బుక్ లో తన సమస్య గురించి ప్రస్తావించగానే వేలాది మంది ఆమెకు మద్దతు పలికారు. ‘‘నా సహచర ఉద్యోగులే నామీద జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా, ఫిర్యాదు అంగీకరించని పక్షంలో.. నాకు ఫేస్ బుక్ ను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు’’ అని ఓ పోలీస్ అకాడమీలో సైబర్ క్రైం విషయాల గురించి బోధిస్తున్న ఆమె పేర్కొన్నారు. మన దేశంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకట్ట వేయాలంటే నలుగురు చేతులు కలిపి ముందుకు సాగాల్సిందేనని ఆమె చెప్పారు.
ఈమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగానే వేలాంది మంది నెటిజన్లు... ‘‘సొంత శాఖలోనే ఒక ఉద్యోగినిపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న పోలీసు శాఖ నుంచి మనం ఇక రక్షణను ఎలా ఆశిస్తాం?’’ అంటూ మద్దతు పలికారు. ఈ విధంగా నెటిజన్లు మద్దతు పలికినందుకు ఆమె ఎంతో హర్షం వ్యక్తం చేసింది. ఫేస్ బుక్ ద్వారా నా బాధను కొంతలో కొంతైనా తగ్గించుకోగలిగానని ఆమె చెప్పుకొచ్చారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more