బాబూ రిక్షా వస్తావా అని అడగటం, ఎంత అని బేరాలాడటం, కాదంటే మరో ఆటో కోసం చూడటం, ఆ ఆటో డ్రైవర్ కి కూడా కథంతా మళ్ళీ చెప్పటం ఇలాంటివాటికి స్వస్థి పలుకుతూ ఢిల్లీలో ఆటో రిక్షాలకు జిపిఎస్ ఏర్పాటు చెయ్యటం జరిగింది. దానితో దగ్గర్లో ఉన్న ఆటో రిక్షాను ట్రాక్ చెయ్యటానికి వెసులుబాటు కలుగుతుంది.
ఎలాగూ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి కాబట్టి, ఫూఛో అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఢిల్లీలో ఎక్కడున్నా వాళ్ళకి అందుబాటులో పరిసరాలలో ఉన్న ఆటోలను ట్రాక్ చేసి, దాన్ని నడుపుతున్న డ్రైవర్ తో మాట్లాడవచ్చు. గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి ఆండ్రోయిడ్ ఫోన్లలో పనిచేసే పూఛో అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకుని మ్యాప్స్ ద్వారా దగ్గర్లోని ఆటో రిక్షా ను లొకేట్ చేయవచ్చు.
ఈ అప్లికేషన్ ని తయారుచేసిన ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (DIMTS) అనుసంధానం చేసిన ఆటో డ్రైవర్ల ఫోన్ నంబర్లను కూడా డేటాలో అప్ డేట్ చెయ్యటం వలన ఆటోని హైర్ చేసేవాళ్ళు ఆ ఆటో డ్రైవర్లతో మాట్లాడుకోవచ్చును.
ఈ పూఛో అప్లికేషన్ ని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. డిఐఎమ్టిఎస్ ద్వారా ఆటోని బుక్ చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫేస్ బుక్ లో కూడా పెట్టటం ద్వారా తమ మిత్రులకు సమాచారం ఇవ్వటానికి కూడా వీలవుతుందని నజీబ్ జంగ్ అన్నారు.
ఆటో లొకేషన్ ని బట్టి ఎంత సేపట్లో అది చేరుకుంటుందో కూడా అంచనా వేసుకునే అవకాశం పాసెంజర్లకు ఉంటుంది. ఇప్పటికే 24000 ఆటోలకు జిపిఎస్ ఏర్పాటు చెయ్యటం జరిగిందని, ఈ పద్ధతిలో ఆటోలను నడిపేవారికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది కాబట్టి త్వరలోనే ఇంకా మిగిలిన ఆటోలు కూడా ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటాయని డిఐఎమ్టిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎన్ సహాయ్ ఆశాభావాన్ని వ్యక్తపరచారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more