(Image source from: sonia gandhi begging for opposition status with bjp party)
ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయిన విషయం అందరికీ తెలిసిందే! దాంతో ఆ పార్టీ కనీస ప్రతిపక్ష హోదాలను కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఆ హోదాను దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన సోనియాగాంధీ అడుక్కుతినడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.
లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు తమకు అన్ని అర్హతలు వున్నాయని సోమవారంనాడు తెలిపారు. తన పార్టీ నేతలతో భేటీ అయిన సోనియాగాంధీ... అధికార పక్షం తరువాత ఎక్కువ సభ్యులున్నది కేవలం తమ పార్టీలోనేనని.. అంతేకాక ఎన్నికలకు ముందు తాము వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు. అందువల్లే తమ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంలోనే సోనియా మాట్లాడుతూ... ‘‘ప్రధాని ప్రతిపక్ష పదవికోసం కోర్టును ఆశ్రయించే ఉద్దేశం లేదు. అవసరమైతే మేము పొత్తు పెట్టుకున్న వివిధ పార్టీల సభ్యులతో సంతకాలు తీసుకుని స్పీకర్ ను కలుస్తాం’’ అని చెప్పారు.
అలాగే ఆ పార్టీ సీనియర్ నేత అయిన కమల్ నాథ్ కూడా బీజేపీ పార్టీని దుయ్యబడుతూ... ‘‘అసలు బీజేపీ పార్టీ తమకు ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించడంలో ఎందుకు భయపడుతుందో అర్థం కావడంలేదు’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. బీజేపీ పార్టీ అదేపనిగా కుట్రపన్ని తమకు ఆ హోదా దక్కకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎలాగైనా తాము ప్రతిపక్ష హోదాను పొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సాధారణంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలంటే... మొత్తం సభ్యుల్లో పదోవంతు కన్నా ఎఖ్కువ సంఖ్యలో సభ్యులను పార్టీ కలిగి వుండాలి. దీని ప్రకారం చూస్తే.. కనీసం 54మంది సభ్యుల ప్రాతినిథ్యం తప్పనిసరిగా కావాల్సి వుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కేవలం 44మంది సభ్యులు మాత్రమే వున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా కల్పించాలంటూ బీజేపీలో వున్న సీనియర్ నాయకులు చెబుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more