Arun jaitely comments on ufo in facebook

Arun Jaitely comments on UFO in Facebook, UFO Day celebrations, Union Minister comments on UFO day, uproar over Arun Jaitley UFO comments, Union Budget on July 10

Arun Jaitely comments on UFO in Facebook

భూమ్మీదకు రండి ఎఫ్ఎమ్ సార్!

Posted: 07/02/2014 06:56 PM IST
Arun jaitely comments on ufo in facebook

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్యాలయం నుంచి ఫేస్ బుక్ లో వర్ల్ డ్ యుఎఫ్ఓ డే శుభాకాంక్షలు తెలియజేయటం మీద సర్వత్రా ఆక్షేపణలు మిన్నుముట్టాయి.  అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యుఎఫ్ఓ) ని సెలబ్రేట్ చేసుకోవటం వలన మనమే కాకుండా రోదసిలో జ్ఞానమున్న జీవాలున్నాయన్న సంగతిని గుర్తుచేసుకోవటమౌతుందని కూడా ఆ ఫేస్ బుక్ పోస్ట్ లో ఉంది.  కింద అరుణ్ జైట్లీ పేరు, గోధుమ పొలం మీద ఫ్లైయింగ్ సాసర్ బొమ్మ కూడా అందులో ఉంది.

దానికి వివిధ రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి.  

"అయ్యా మంత్రిగారు మేము పెరిగిన ధరలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం.  మీరు బడ్జెట్ లో ఇంకా ఏమేం ధరలు పెంచేస్తారో అని భయపడుతున్నాం.  మీరు కాసేపు బయటి ప్రపంచంలోంచి తిరిగి మన భూమ్మీదకు రాగూడదూ, సామాన్య మానవుడి ఇబ్బందులను పట్టించుకోగూడదూ!" అంటూ కామెంట్లు వచ్చాయి.  

దానితో ఫేస్ బుక్ లోని ఆ పోస్టింగ్ ని తీసేయటం జరిగింది.  

జూలై 10 న అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ గురించి ఆందోళన చెందుతున్న వారంతా ఈ ఫేస్ బుక్ లో రాసింది చూసి ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.  ఆర్థిక శాఖ అధికారులు కూడా, ఫేస్ బుక్ లో రాసింది తాము చూసామని, అయితే ఇలాంటివి రాసేటప్పుడు మంత్రిగారి వ్యక్తిగత సిబ్బంది కాస్త జాగ్రత్త వహించాలని చురకలంటించారట.  

అది ఫైనాన్స్ మినిస్టర్ ఫేస్ బుక్ అకౌంటేనని, దాన్నెవరూ హ్యాకింగ్ చెయ్యలేదని కూడా తన పేరుని గుప్తంగా ఉంచమని కోరిన సిబ్బందిలో ఒకరు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more