కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఎన్నిక పరిస్థితి ప్రస్తుతం డైలమాలో పడింది. ఈ స్థానం నుంచి వైకాపా తరఫున పోటీచేస్తున్న భూమా శోభ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ప్రతిష్టంభన ఏర్పడింది.
అయితే ఈ ఎన్నిక గురించి ఎన్నికల సంఘం నిర్ణయం గురించి కొందరు వ్యక్తులు శవరాజకీయం చేయడం ప్రారంభించారు.
ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఇక్కడ ఆమెకు వేసే ఓటు చెల్లదని, ఆమెకు మెజారిటీ వస్తే.. రెండో స్థానంలోని వారిని గెలిచినట్లు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే ఆ తరువాత.. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి వివరణ ఇస్తూ.. శోభకు వేసే ఓటు చెల్లుతుందని ... ఆమెకు మెజారిటీ వస్తే ఉప ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎటూ ఉప ఎన్నిక జరిగినా సరే ఆ సీటు వైకాపా పరం అవుతుందని.. అలా కాకుండా.. శోభ పేరు తొలగింపజేస్తే తాము లబ్ధి పొందుతామని ఆశిస్తున్న పార్టీల వారే వక్రబుద్ధితో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు వేశారు. చనిపోయిన తర్వాత.. ఆ అభ్యర్థి కి ఓటు వేయాలన్నట్లుగా ఈవీఎంలో మాత్రం ఉంచడంలో అర్థం లేదంటూ కేసు వేశారు. ఈవీఎం లలోంచి శోభ పేరును తొలగించాలంటూ కేసులో పేర్కొన్నారు. ఈ విషయంలో హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసు జారీచేసింది. అయితే ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత.. ఇక ఎన్నికల సంఘం విధుల్లో కోర్టు జోక్యం చేసుకోజాలదంటూ ఈసీ కోర్టు ఎదుట వాదించింది.
ఈవీఎం నుంచి శోభ పేరును తొలగించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆళ్లగడ్డ ఎన్నిక ఫలితాన్ని పెండింగ్లో పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎటూ ఉప ఎన్నిక జరిగినా సరే ఆ సీటు వైకాపా పరం అవుతుందని.. అలా కాకుండా.. శోభ పేరు తొలగింపజేస్తే తాము లబ్ధి పొందుతామని ఆశిస్తున్న పార్టీల వారే వక్రబుద్ధితో ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికలో గెలిచే సత్తా లేక.. శవరాజకీయాలు చేస్తున్నారని ఆళ్లగడ్డ ప్రజలు అనుకుంటున్నారు. -
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more