ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టు వ్యవహారాలను ప్రజలకు అందుబాటులోకి తేవటం కోసం రూపొందించబడ్డ వెబ్ సైట్ http: //ecourts.gov.in/ap ను హైకోర్టు సెంట్రల్ హాల్లో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ప్రారంభించారు. ఈ విషయంలో మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి వెబ్ సైట్ వలన ఉపయోగాలను తెలియజేసారు. న్యాయవాదులు మాత్రమే చూసి తమ క్లయింట్ లకు తెలియజేస్తూ వస్తున్న వివరాలను ఇక నేరుగా వెబ్ సైట్ లో చూసుకోవటానికి ఇందులో వెసులబాటుందని అన్నారు.
ఈ కోర్టు ప్రాజెక్ట్ ద్వారా ఈ స్టీరింగ్ కమిటీ అధ్వర్యంలో నిర్మించబడ్డ ఈ వెబ్ సైట్ లో 890 న్యాయస్థానాలను అనుసంధానం చేసారని ఆ కోర్టుల లోని కేసుల స్థితిగతులను, వివరాలను ఈ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. దీన్ని నిర్మించినవారిని ఆయన అభినందించారు.
ఈ వెబ్ సైట్ లో రోజువారీ కేసుల వివరాలతోపాటు, ఏ డైరీ, పూర్తయిన కేసుల మీద తీర్పులు, జిల్లా న్యాయాధికారుల వివరాలు పొందుపరచబడ్డాయి. అంతే కాకుండా, కోర్టులలో ఉద్యోగ ప్రకటనలు, టెండర్ల వివరాలు, జిల్లా చరిత్ర మొదలైన జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సమాచారం కూడా ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more