చంద్రగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై శనివారం వైసీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారానికి రావద్దంటూ సామిరెడ్డిపల్లెలో అడ్డుకున్నారు. గ్రామంలోకి మాజీ మంత్రి రాకూడదని, ప్రచారం చేయకూడదంటూ వాహనశ్రేణిని అడ్డుకున్నారు.ఆమె వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ విషయం తెలిసి టీడీపీ శ్రేణులూ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వైసీపీ తీరుకు నిరసనగా పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు రాస్తారోకో చేపట్టారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం గల్లా అరుణకుమారి సామిరెడ్డిపల్లెకు చేరుకున్నారు. గ్రామంలో ప్రచారం చేయరాదంటూ వైసీపీ శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకోనీయకుండా అడ్డుకోవడం తగదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. గ్రామంలో ప్రచారం చేస్తామంటూ వారు పట్టుబట్టారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. గ్రామంలోకి మాజీ మంత్రి రాకూడదని, ప్రచారం చేయకూడదంటూ వాహనశ్రేణిని అడ్డుకున్నారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాల వారికి నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ వివాదం తెలిసి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మండలంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారాన్ని తామూ అడ్డకుంటామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఎట్టకేలకు తర్వాత గల్లా అరుణకుమారి గ్రామంలోని టీడీపీ మద్దతుదారుల ఇంటికెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం బయనపల్లెకు వెళ్లేందుకు.. వాహనశ్రేణి సామిరెడ్డిపల్లె పాఠశాల సమీపానికి చేరుకోగానే.. మళ్లీ రెండు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో అరుణకుమారి వాహనంపై వైసీపీ కార్యకర్తలు రుళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు వర్గాలూ రాళ్ల దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more