Man brutally attacked woman in MRT lift ఒంటరి మహిళపై దాడి.. నెట్టింట్లో వైరల్..

Brutal lift mugger repeatedly punches woman in the face

assault, robbery, CCTV, mrt, Taman Mutiara Cheras, Cheras MRT station lift, single woman, Violence, attack, safety, Malaysia, social media. viral video, Crime

A man brutally attacked and robbed a woman in a lift at the Taman Mutiara Mass Rapid Transit (MRT) station in the Cheras district of Kuala Lumpur, Malaysia.

ITEMVIDEOS: ఒంటరి మహిళపై అగంతకుడి దాడి.. నెట్టింట్లో వైరల్..

Posted: 02/20/2019 05:50 PM IST
Brutal lift mugger repeatedly punches woman in the face

మలేసియాలో ఓ ఒంటరి మహిళపై దోంగ దాడికి పాల్పడటం.. అమె నుంచి బ్యాగును లాక్కునేందుకు దారుణంగా తెగబడిన చోరీ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కేవలం మలేషియాలోనే కాదు.. ఈ వీడియోను అప్ లోడ్ చేస్తూ.. సర్కూలేట్ చేస్తున్న నెట్ జనులు.. తమ బంధుమిత్రులకు కూడా వీడియోను షేర్ చేస్తూ.. మహిళలే కాదు చిన్నారులు కూడా ఇకపై ఒంటరిగా లిప్ట్ లోకి వెళ్లకూడదంటూ సూచిస్తున్నారు. జన సంచారం వున్న మార్గాలనే ఎంచుకోవాలని కోరుతున్నారు.

అసలేం జరిగిందీ అంటే.. మలేషియాలో ఓ ఒంటరి మహిళ లిఫ్ట్ లోకి ఎక్కిడం గమనించిన ఓ దొంగ... ఆమె వెనకాల వచ్చాడు. వెనక్కు తిరిగిన అమె లిప్ట్ వైపు చూసే లోపు.. లిప్ట్ డోర్ పడిపోయింది. అప్పటివరకు ఎంతో అమాయకంగా నటించిన అగంతకుడు లిప్టు తలుపులు మూసుకోగానే అత్యంత క్రూరంగా మారిపోయాడు. లిప్ట్ లోని ఒంటిర మహిళపై అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఆమెను బ్యాగును తీసుకున్నాడు. బ్యాగు ఇవ్వకుండా ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు.

కడుపులో తన్నుతూ, తీవ్రంగా కొట్టాడు. ఎస్కలేటర్ డోర్ తెరుచుకున్న సమయంలో ఏమీ ఎరుగనట్టుగా నించున్నాడు. కాళ్లతో మహిళను పక్కకు పట్టి, లిఫ్ట్ తలుపులు మూసుకోగానే మరోసారి ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. తర్వాత ఆమె చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని పరారయ్యాడు. అత్యంత క్రూరంగా జరిగిన ఈ దాడి ఉదంతం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దారుణ సంఘటన మలేసియాలోని కౌలాలంపూర్, చెరస్ జిల్లాలో జరిగింది.

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం నాడు జరిగిన ఈ సంఘటన... ఫేస్ బుక్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించడం విశేషం. లిప్టులో మహిళపై దాడి చేసిన వ్యక్తిని పట్టించిన వారికీ గానీ, అతని గురించిన సమాచారం ఇచ్చిన వారికీ గానీ 10 వేల మలేసియన్ రిగ్గిట్స్ (దాదాపు లక్షా 75 వేల రూపాయలు) పారితోషికం ఇస్తామని అక్కడి పోలీసు అధికారులు ప్రకటించారు. దొంగ దాడిలో తీవ్రంగా గాయపడిన 48 ఏళ్ల మహిళ స్థానికంగా గల ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమె పర్సులో ఐడీ కార్డు, ఏటీఎంలతో పాటు 400 రిగ్గిట్స్ నగదు కూడా ఉన్నట్టు తెలిపిందామె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : single woman  Violence  attack  safety  Malaysia  social media. viral video  Crime  

Other Articles