good education system is needed for the society సమాజానికి మంచి విద్యావ్యవస్థ అవసరం: దిలిప్ చక్రవర్తి

Good education system is needed for the society

byra dilip chakravarthy, vemsoft india, students, madhav bhavan, good educational system, good personalities, good citizens, India

Apart from marks and ranks, heavy competition an good education system is needed for the society for students to mould them as good personalities

సమాజానికి మంచి విద్యావ్యవస్థ అవసరం: దిలిప్ చక్రవర్తి

Posted: 04/23/2018 05:04 PM IST
Good education system is needed for the society

సమాజానికి ఇవాళ మంచి ఉన్నత ప్రమాణికలు కల్గిన విద్యా వ్యవస్థ అవసరం వుందిన వెన్ సాఫ్ట్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బైరా దిలిప్ చక్రవర్తి అన్నారు. మార్కులు, ర్యాంకులతో ముడిపడ్డ విద్యావ్యవస్థలో విద్యార్థుల ప్రమాణాలు, నైతిక విలువలు అడుగంటిపోతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో అంకితబావంతో పాటు సేవాభావం, ఉత్తమ లక్షణాలు, ఉన్నత విలువలు పెంపోందించాల్సిన అవసరం కూడా ఎంతైనా వుందని అన్నారు.

ఈ నేపథ్యంలో జాతియ విద్యా సేవా సమితి చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వేదాలు ఘోషించినట్లు.. ఉపనిత్తులు స్పష్టం చేసినట్లు హిందూ విద్యా విధానం ఉత్తమ ప్రణాలను పెంపొందిస్తుందని అన్నారు. హిందూ అనగానే ఒక మతం అని పరిగణించరాదని, అది సగటు మానవుడు ఎలా జీవించాలో చెప్పే జీవన విధానమని ఆయన అన్నారు. దాని ప్రాముఖ్యతను ప్రాశిత్యాన్ని పెంపెందించే జాతీయ విద్యా సేవా సమితికి.. బాలయ్య లాంటి పెద్దలకు అభినందనలు తెలిపారు.

జాతీయ విద్యా సేవా సమితి అధ్వర్యంలో నిర్మించిన మాదవ భవన్ నిర్మాణానికి అతిధిగా హాజరైన దిలిప్ చక్రవర్తి.. విద్యాదానం కన్నా ఏ దానం గొప్పది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్య లో వికాసం, విలువలు, సమాజ పోకడలు, పయనించే మార్గాలు అన్ని విద్యార్థులకు తెలియజేస్తాయని, దాంతో వారు సక్రమైన మార్గంలో పయనించి ఉత్తమ వ్యక్తిక్తం గలవారిగా తీర్చిదిద్దబడతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం దిలిప్ చక్రవర్తిని సమితి నిర్వాహకులు శాలువా కప్పి సన్మానించారు.

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh