Upset Jwala Gutta Tweets on Government సంచలన ట్వీట్ చేసిన గుత్తా జ్వాల.. అంతలోనే..

Jwala gutta blames government for badminton academy land snub

Jwala Gutta, KCR, KTR, Shuttler Jwala Gutta, Chief Minister Office, IT Minister, KT Rama Rao, assurances, Badminton Academy, sports news,sports, latest sports news, cricket

Doubles veteran Jwala Gutta criticised Telangana government for not keeping up the promises even after 4 years in the social media post.

సంచలన ట్వీట్ చేసిన గుత్తా జ్వాల.. అంతలోనే..

Posted: 08/07/2018 01:36 PM IST
Jwala gutta blames government for badminton academy land snub

బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసి.. అది కాస్తా వైరల్ కాగానే వెంటనే దానిని డిలీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో అమె ఏకంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. తెలంగాణ సర్కారు తనకు ఇచ్చిన హామీలను నాలుగేళ్లు పూర్తికావస్తున్నా నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించింది. ఆమె ఇలా ట్వీట్ చేయగానే అది ఒక్కసారిగా వైరల్ అయింది. అన్ని చానళ్లలోనూ ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత కాసేపటికే జ్వాల ఆ ట్వీట్ ను తొలగించింది.

ఇంతకీ అమె ఆ ట్వీట్ లో ఏం పేర్కోనిందంటే.. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తనకు స్థలం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. దీంతో పాటు ఇంటి స్థలం కోసం కూడా ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం తనకు హామి ఇచ్చి నాలుగేళ్లు అయ్యిందని అన్నారు. అయినా, ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఈ డబుల్స్ స్టార్ విమర్శించింది.

తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా అప్పట్లో ప్లాట్లు ప్రకటించిందని, అందులో భాగంగానే తనకూ నజరానాలు ప్రకటించిందని పేర్కొన్న జ్వాల ఇప్పటి వరకు అది అందకపోవడం బాధగా ఉందని పేర్కొంది. అయితే ఈ ట్వీట్ ను తన అకౌంట్లో మాత్రమే పోస్టు చేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కే తారాక రామారావుకు కూడా ట్యాగ్ చేసింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jwala Gutta  KCR  KTR  Chief Minister Office  KTR  assurances  Badminton Academy  sports  

Other Articles

 • Hong kong open kidambi srikanth lose in quarterfinals

  హాంకాంగ్ ఓపెన్: ముగిసిన భారత షెటర్ల పోరు..

  Nov 16 | కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ లో భారత షట్లర్లు వరుసగా ఇంటిబాట పడుతున్నారు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. నిన్న రెండో రౌండ్‌లో పీవీ సింధు... Read more

 • Ace manjit singh gears up with eyes set on tokyo olympic glory

  టోక్యో ఒలంపిక్స్ వైపు మంజీత్ సింగ్ చూపు.!

  Oct 05 | ఆసియా గేమ్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతక విజేత మన్‌జీత్ సింగ్.. తన తదుపరి ధ్యేయాన్ని మీడియా ముందు రివీల్ చేశాడు. టోక్యో ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించాలని అన్నారు. అయితే... Read more

 • Saina nehwal set to marry parupalli kashyap in december

  డిసెంబర్ లో సైనా నెహ్వాల్, కశ్యప్ ప్రేమ పరిణయం

  Sep 26 | భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ను ఆమె వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి... Read more

 • China open 2018 india campaign ends as pv sindhu crash out

  చైనా ఓపెన్ నుంచి నిష్ర్కమించిన పివి సింధు

  Sep 21 | ప్రతిష్టాత్మక డ్రాగన్‌ టైటిల్‌ వేటలో క్వార్టర్స్ ఫైనల్స్ లో తెలుగు తేజం పివీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచుల్లో పోరాడి గెలిచిన పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో మాత్రం నిష్క్రమించక తప్పలేదు.... Read more

 • Swapna barman gets a concrete road to her jalpaiguri home

  పసిడే కాదు.. ప్రగతిపథంలో గ్రామాన్ని నిలుపుతుంది..

  Sep 05 | ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించి తొలి భారత అథ్లెట్ గారికార్డు సృష్టించిన స్వప్న బర్మన్‌ తన గెలుపుతో తన గ్రామానికి కూడా మంచి చేసింది. దవడ నొప్పితో భాధపడుతూ కూడా తన... Read more

Today on Telugu Wishesh