Indian boxer satish kumar won bronze in asian games

asian games, asian games schedule, asian games indian players, asian games indian athletics, indian athlets, latest news, sports news, asian games ending cermony, asian games starting cermony, asian games latest news, asian games live, asian games latest updates, boxers, boxing, indian boxers, indian boxing team, sports news, athletics, indian boxer satish kumar, satish kumar, satish kumar boxer

indian boxer satish kumar won bronze medal in asian games 2014 in super heavy stream : boxer satish kumar lost gold medal by failing in semi finals with kazakishtan boxer dychko and got bronze medal

పంచ్ పడలేదు.., చివరకు కాంస్యం పడింది

Posted: 10/02/2014 01:57 PM IST
Indian boxer satish kumar won bronze in asian games

ఆసియా క్రీడల్లో గతంలో పోలిస్తే ఈ దఫా మన అథ్లెట్ల ప్రతిభ చాలా మెరుగయింది. పతకాల సంఖ్య కూడా పెరిగింది. అయితే చాలామంది కష్టం వృధాగా పోతుంది. చివరి వరకు వచ్చి పైనల్ మ్యాచ్ లలో ఓడిపోతున్నారు. దీంతో రజత, కాంస్య పతకాలు మనకు మిగులుతున్నాయి. ఇప్పటివరకు స్వర్ణాల సంఖ్య పది దాటలేదు. తాజాగా భారత బాక్సర్ సతీష్ కుమార్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 91కేజీల పైచిలకు వెయిట్ తో సూపర్ హెవీ విభాగంలో సెమిఫైనల్ కు వెళ్ళిన సతీష్
ఇవాళ జరిగిన పోరులో కజకిస్థాన్ బాక్సర్ డైకో చేతిలో పరాజయం పాలయ్యాడు.

ఆటలో ఓడిపోయినా వట్టి చేతులతో కాకుండా పతకం పట్టుకుని వస్తున్నందుకు కాస్త సంతోషించాలి. భారత బాక్సర్లకు పతకం రాలేదు అనే భావన ప్రపంచ దేశాలకు రాకుండా చేశాడు. తాజా కాంస్యంతో ఇప్పటివరకు 2014 ఆసియా గేమ్స్ లో భారత్ కు 51పతకాలు వచ్చాయి. వీటిలో 7 స్వర్ణాలు అయితే 9వెండి పతకాలు మిగిలిన 35 కాంస్య పతకాలు. క్వార్టర్ ఫైనల్ లో జోర్డాన్ కు చెందిన హుస్సేన్ పై గెలిచిన తర్వాత భారత్ కు ఖచ్చితంగా పతకంతో వస్తాను అని సతీష్ కుమార్ ధీమాగా ప్రకటించాడు. చెప్పినట్లుగానే పతకంను తీసుకువచ్చాడు. కాకపోతే అది బంగారు పతకం అయితే ఇంకా బాగుండేది అని అభిమానులు ఫీలవుతున్నారు.

సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఆసియా గేమ్స్ అక్టోబర్ 4తో ముగియనున్నాయి. మిని ఒలంపిక్స్ గా పిలిచే ఈ గేమ్స్ లో ఇప్పటివరకు చైనా అత్యధిక పతకాలు సాధింది అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ గతంతో పోలిస్తే పతకాల పరుగులో కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. కాకపోతే మనకంటే జనాభాలో, విస్తీర్ణంలో చిన్న దేశాలు చాలా వరకు ముందుండటం బాధాకరం. ఇక 25సంవత్సరాలుగా ఆసియా గేమ్స్ లో కబడ్డి కింగ్ గా నిలిచిన భారత జట్టు ఈ సారి కూడా స్వర్ణం సాధించేందుకు ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఈ దఫా పురుషుల, మహిళల జట్లు రెండూ ఇరాన్ దేశ పురుషుల, మహిళల జట్లతో ఢీ:కొంటున్నాయి. అక్టోబర్ 3(శుక్రవారం) తుది పోరు జరుగుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satish kumar  boxing  asian games  latest news  

Other Articles