Beauty war between south and north korea in asian games 2014

asian games 2014, incheon asian games, north korea, south korea, asian games sports persons, indian sports persons, south korea officials

beauty war between south and north korea in asian games 2014

ఆసియా క్రీడల్లో అందాలకోసం గొడవపడుతున్న దేశాలు!

Posted: 09/24/2014 04:44 PM IST
Beauty war between south and north korea in asian games 2014

ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అనుకోకుండా ఒక అరుదైన ఘట్టం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఈ క్రీడల్లో కేవలం క్రీడాకారుల మధ్యే జరుగుతుందనుకుంటే.. తాజాగా ఆ క్రీడల్లో పాల్గొంటున్న అందాలకోసం కూడా ఏకంగా రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తల సమాచారం! నిజానికి దక్షిణ కొరియాకు, ఉత్తర కొరియా మధ్య రాజకీయం వైరం పాతదే! అదే వైరం ఈసారి ఆసియా క్రీడల మీద కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆ రెండు దేశాల మధ్య అందాల యుద్ధం జరుగుతోంది.

ఉత్తర కొరియాలో అందమైన అమ్మాయిలకు కొదవే లేదు. దీంతో దక్షిణ కొరియాలో ఇంతకుముందు జరిగిన క్రీడోత్సవాలకు తమ అమ్మాయిలను చీర్ లీడర్లుగా పంపింది. 2002లో బుపాస్ ఆసియా క్రీడల్లోనూ ఉత్తర కొరియా అమ్మాయిలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇలా ఈ విధంగా దక్షిణ కొరియాలో జరిగే ప్రతి క్రీడలకు ఉత్తర కొరియా తమ అందమైన అమ్మాయిలను చీర్ లీటర్లుగానూ, పతకాలు పట్టుకుని వేదికపై కనువిందు చేసే అమ్మాయిలుగానూ పంపించేవారు. ఐతే ఈసారి ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మాత్ర తమ అమ్మాయిలను పంపించడానికి ఉత్తర కొరియా నిరాకరించింది. దీంతో మొదట ఖంగుతిన్న దక్షిణ కొరియా.. తిరిగి కోలుకొని తనదైన శైలిలో ఉత్తర కొరియాకు సమాధానమిచ్చింది.

దక్షిణ కొరియా అధికారులు స్థానికంగా వుండే ఓ కళాశాలలో ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న అమ్మాయిలకు క్రీడలకోసం ప్రత్యేకంగా అందాల శిక్షణ ఇప్పించారు. మొత్తంగా 240 మందిని పతక ప్రదాన కార్యక్రమాల కోసం సిద్ధం చేశారు. యువరాణుల తరహాలో ప్రత్యేక దుస్తులు, అలంకరణతో పతకాలు పట్టుకుని వేదికలపైకి వస్తున్న ఈ అమ్మాయిలు.. క్రీడల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్తర కొరియాలోనే కాదు.. తమ దగ్గర కూడా అందమైన అమ్మాయిలకు ఏమాత్రం కొరత లేరని దక్షిణ కొరియా సమాధానమిచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : incheon asian games  south korea  north korea  beautiful girls  sports persons  

Other Articles