Telugu athletes in asia games 2014

telugu athletes, asian games 2014, saina nehwal, gagan narang, pv sindhu, badminton players, young indian athletes asian games

telugu athletes in asia games 2014

ఆసియా క్రీడారంగంలో తెలుగుసైన్యం! గెలుస్తారా?

Posted: 09/12/2014 12:15 PM IST
Telugu athletes in asia games 2014

ప్రస్తుత నేపథ్యంలో ఆసియా క్రీడలు రసవత్తరంగా మారాయి. ఇందులో ఇండియా సీనియర్ ఆటగాళ్లు పాల్గొనకపోవడంతో భారం మొత్తం జూనియర్ ఆటగాళ్లమీదే పడింది. దీంతో వీరంతా ఈ క్రీడల్లో తమతమ సత్తా చాటి, పతకాలు గెలుస్తారా..? లేదా..? అన్నది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన మన సీనియర్ ఆటగాళ్లందరూ కొన్నికొన్ని సందర్భాల్లో తడబడి వెనుదిరిగిన సమయాలు చాలానే వున్నాయి. అటువంటిది ఈసారి జూనియర్ ఆటగాళ్లు ఎలా నెగ్గుతారోనన్నది అందరిలో ఒక్కటే టెన్షన్ మొదలయ్యింది. వివిధ కారణాల వల్ల ఈ ఆసియా క్రీడలకు దూరమైన సైనా నెహ్వాల్, లియాండర్ పేస్, సానియా మీర్జా ఇంకా తదితర ఆటగాళ్లు తప్పుకోవడంతో వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లు నియమించారు. 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ ఏసియన్ గేమ్స్ ఇచియాన్ లో జరగనున్నాయి.

ఇదిలావుండగా.. ఈ ఆసియా క్రీడల్లో మన తెలుగుతేజాలూ పాలుపంచుకోనున్నారు. కామన్వెల్త్ లో తమ సత్తాచాటిన ఈ క్రీడాకారులు.. ఆసియా క్రీడల్లో మెరుపులు మెరిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. అథ్లెటిక్ నుంచి ఆర్చరీ వరకు.. బ్యాడ్మింటన్ నుంచి షూటింగ్ దాకా వున్న క్రీడాకారుల దృష్టంతా పతకాలపైనే వుంది. వీరిలో ముఖ్యంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, గగన్ నారంగ్ లు వంటి తెలుగు తేజాలు తమ సత్తా చాటడానికి సిద్ధంగా వున్నారు. గతంలో గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు దూరమైన సైనా నెహ్వాల్.. ఆసియా క్రీడల కోసం బెంగుళూరులో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలు కావడంతో.. తన ఆటలో వున్న లోపాల్ని సవరించుకుని, ఇందులో గెలవాలనే పట్టుదలతో వుంది.

అలాగే ఆమెతోపాటు కాంస్యం సాధించిన సింధుకు భారత్ తరఫున ఎన్నో పతకాలు లభించాయి. దీంతో ఈమె ఆసియా క్రీడల్లో తప్పకుండా గెలుస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, సుమీత్ రెడ్డి పోరాడితే.. ఖచ్చితంగా పతకం వచ్చేస్తుంది. గుత్తాజ్వాల తప్పుకోవడంతో మహిళల డబుల్స్ లో పతకం వచ్చే అవకాశం పోయింది. ఇక ఎక్కువ పతకాలు వచ్చే అవకాశమున్న క్రీడల్లో షూటింగ్ ఒకటి. ఎందుకంటే.. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, కాంస్యం గెలుచుకున్న నారంగ్.. ఈసారి ఆసియా క్రీడల్లోనూ మెరిసే అవకాశం వుంది. యువ ఆగాడు కౌనస్ షెనాయ్ సత్తాచాటుతాడా లేదా అన్నది వేచి చూడాలి.

వీరితోబాటు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ఇతర ఆటగాళ్లు...
ఆర్చరీ: వెన్నం జ్యోతిసురేఖ, వర్ధినేని ప్రణీత, పూర్వాషా షిండే
జిమ్నాస్టిక్స్: అరుణరెడ్డి,
కబడ్డీ: తేజస్విని బాయి, మమత పూజారి, కవిత, నీతా దాడ్వే (కోచ్),
అథ్లెటిక్స్: నాగపురి రమేశ్ (కోచ్),
సెపక్‌తక్రా: రాళ్ళ నవత,
టెన్నిస్: సాకేత్ మైనేని, రిషిక సుంకర,
టేబుల్ టెన్నిస్: ఆచంట శరత్‌కమల్

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu athletes  asian games 2014  saina nehwal  gagan narang  

Other Articles