Andy murray defeat by wawrinka

dy murray, stanislas wawrinka, novak djokovic, mikhail youzhny, quarterfinals, open, grand slam, defending champ

The defending US Open champion, Andy Murray lost 6-4, 6-3, 6-2 to Stanislas Wawrinka.

ముర్రేకు షాక్ ఇచ్చిన వావ్రింకా

Posted: 10/17/2013 07:11 PM IST
Andy murray defeat by wawrinka

ఈ ఏడాది కేలండర్ లో జరుగుతున్న చివరి యూఎస్ ఓపెన్ లో పెను సంచలనాలు నమోదు అవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన టాప్ సీడ్ ఆటగాళ్ళు అన్ సీడెడ్స్ చేతిలో ఓడిపోతున్నారు. మొన్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓటమి బాట పట్టగా, నేడు బ్రిటన్ స్టార్ ప్లేయర్, డిపెండింగ్ ఛాంపియన్ ఆండ్రూ ముర్రే నమ్మశక్యం కాని రీతిలో ఓడిపోయి, అందర్ని షాక్ కి గురి చేశాడు. వరుసగా 35 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆడుతున్నా ఇంత వరకు ఎటువంటి సంచలనాలు నమోదు చేయలేక పోయినా వావ్రింకా ముర్రేను వరుస సెట్‌లలో ఓడించి యూఎస్ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం నమోదు చేశాడు. మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేశాడు. తొమ్మిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) నమ్మశక్యంకానిరీతిలో ఆడుతూ వరుస సెట్‌లలో 6-4, 6-3, 6-2తో ముర్రేను బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో వావ్రింకా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. నేడు సెమీఫైనల్స్ లో వావ్రింకా , జొకోవిచ్ లు తలపడనున్నారు. 2004లో ఆండీ రాడిక్ తర్వాత యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles