Shahbaz Ahmed Replaces Injured Washington Sundar జింబాబ్వేతో వన్డే సిరిస్ కు దూరమైన ఆల్‌రౌండర్.!

Washington sundar out of zimbabwe series with shoulder injury

Washington Sundar, Indian cricket team, washington sundar injured, Shahbaz Ahmed, Maiden India Call-Up, U-19, washington sundar injury, washington sundar zimbabwe, ind vs zim, india vs zimbabwe odi series, india vs zimbabwe series, sports news, Cricket news, sports, cricket

Washington Sundar had just begun to enjoy life in Lancashire. The wickets were piling on; in four games, he nabbed 11 at an average of 25, healthy numbers for someone considered a part-time spinner in first-class cricket. Last week, he produced arguably the ball of the month when an off-break of his spun devilishly from outside off-stump to sneak through the defences of Kent’s Jordon Cox.

జింబాబ్వే పర్యటనలో టీమిండియాకు షాక్.. గాయంతో దూరమైన ఆల్‌రౌండర్

Posted: 08/16/2022 06:40 PM IST
Washington sundar out of zimbabwe series with shoulder injury

జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఆరేళ్ల తరువాత జింబాబ్వేకు వెళ్లిన భారత జట్టులో సభ్యుడిగా ఎంపికైన టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఎడమ చేతి భుజానికి గాయం కావడంతో సుందర్.. ఈ పర్యటన నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ తెలిపింది. తరుచూ గాయాల బారిన పడుతున్న సుందర్‌కు జట్టుకు ఎంపికై సిరీస్ నుంచి మరోమారు తప్పుకోవడం ఆయన అభిమానులకు అందోళన కలిగిస్తోంది.

గడిచిన ఏడాదికాలంగా దాదాపు ఏడు సిరీస్‌లలో జట్టుకు ఎంపికైనా గాయం కారణంగా దూరమయ్యాడు వాషింగ్టన్ సుందర్. ఐపీఎల్ ముగిశాక ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్లిన సుందర్ అక్కడ గాయపడ్డాడు. రాయల్ లండన్ కప్‌లో భాగంగా మ్యాచ్ ఆడుతుండగా సుందర్ ఎడమభుజానికి గాయమైంది. సుందర్ గాయాన్ని పరిశీలించిన వైద్య బృందం.. అతడికి విశ్రాంతి అవసరమని సూచించింది. దీంతో సుందర్ త్వరలోనే బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లో చికిత్స పొందనున్నాడు.

సుందర్ వైదొలగడంతో ఆ స్థానాన్ని బెంగాల్ యువ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ భర్తీ చేయనున్నాడు. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన షాబాజ్.. బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా కూడా మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత జరిగిన రంజీ సీజన్‌లో కూడా రాణించాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కోసం చూస్తున్న భారత్.. షాబాజ్‌ను జింబాబ్వేకు పంపనున్నది. ఇదిలావుండగా, జింబాబ్వేతో భారత జట్టు.. ఈనెల 18, 20, 22న మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కు కెఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు వహించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles