Dean Jones, ODI batting pioneer, dies aged 59 ముంబైలో క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ కన్నుమూత

Former australia cricketer dean jones dies of heart attack at 59

dean jones cricketer, cricketer dean jones died, cricketer dean jones death news, cricketer dean jones passed away, dean jones cricket career, dean jones cricket records, dean jones latest news, dean jones, dean jones death, dean jones cricketer, dean jones dies, Australian Cricket Legend Dean Jones, Ipl 2020, Dean Jones, commentator dean jones, Australia national cricket team, cricket, sports

Former Australia cricketer Dean Jones died of a heart attack on Thursday in Mumbai. He was 59. Dean Jones was in India to fulfil his commitments for the host broadcasters of the Indian Premier League. He suffered a massive heart attack at a hotel in Mumbai

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత డీన్ జోన్స్ కన్నుమూత

Posted: 09/25/2020 09:51 AM IST
Former australia cricketer dean jones dies of heart attack at 59

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59) కన్నుమూశారు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ముంబైలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరుగుతున్నా, ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో వ్యాఖ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ కారిడార్ లో ఇతర సహచరులతో ముచ్చటిస్తున్న ఆయన ఉదయం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.

దీంతో హడలిపోయిన సహచరులు ఆయనను వెంటనే అంబులెన్స్ లో హరికిషన్ దాస్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మార్గమధ్యంలోనే జోన్స్ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జోన్స్ మృతి చెందిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా, జోన్స్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలున్నాయి. డీన్ జోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90వ దశకాల్లో అనేక వీరోచిత ఇన్నింగ్స్ లతో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించారు.

1984లో టెస్ట్ కెరీర్ ఆరంభించిన జోన్స్ 52 మ్యాచ్ లు ఆడి 11 సెంచరీలు, 14 అర్ధసెంచరీలతో 3,631 పరుగులు సాధించాడు. సగటు 46.55. ఇక వన్డేల్లో 164 మ్యాచ్ లు లు ఆడి7 సెంచరీలు, 46 ఫిఫ్టీల సాయంతో 6,068 రన్స్ నమోదు చేశాడు. జోన్స్ మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ రంగంలోనూ విషాదం నెలకొంది. ఆ ఆసీస్ దిగ్గజం ఇక లేరన్న వార్తతో ఆయనతో అనుబంధం ఉన్న మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. క్రీడా ప్రముఖులు ఆయన మృతికి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles