'Big fan of MS Dhoni,' says MSK Prasad ఎంఎస్ ధోని కెరీర్ పై ఎవరూ ప్రశ్నించలేరు: ఎంఎస్కే

Msk prasad has his say on ms dhoni s retirement rumours

India vs New Zealand, MS Dhoni, MSK Prasad, India captain, Chennai Super Kings, ICC trophies, Mahendra Singh Dhoni, MSK Prasad MS Dhoni,ms dhoni,ms dhoni retirement,ms dhoni movie,ms dhoni song,ms dhoni cricket, RP Singh, Pani Puri, Maldives, India captain, Viral Videos, Cricket, latest cricket news, today cricket match, cricket score, sports news, cricket news, sports

Former chairman of selectors M.S.K. Prasad is as big a fan of MS Dhoni as anyone else, although in his chair, it was his job to 'move on' from the stumper and give youngsters a chance.

ఎంఎస్ ధోని కెరీర్ పై ఎవరూ ప్రశ్నించలేరు: ఎంఎస్కే

Posted: 02/06/2020 09:30 PM IST
Msk prasad has his say on ms dhoni s retirement rumours

టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని, అతడికి తాను వీరాభిమానినని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. టీమిండియాకు రెండు (వన్డే, టీ20) ప్రపంచకప్ లతో పాటు ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించాడని తెలిపాడు. అంతేకాదు టీమిండియా జట్టును టెస్టు పార్మెట్లల్లో నంబర్‌ వన్ స్థానాన్ని కైవసం చేసిపెట్టింది కూడా తానేనని తెలిపాడు. మహి అన్నీ సాధించాడని చెప్పాడు.

సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా తన పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంఎస్కే.. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌ ఛానెల్ తో తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించిన ఆయన ధోని విరమణను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. మహి కెరీర్ ఆయన చేతిలోనే వుందని అన్నారు. ఈ విషయంపై అతడే ఒక నిర్ణయం తీసుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ధోని లాంటి క్రికెటర్, కెప్టెన్, వికెట్ కీపర్ గా ఎవరూ రాణించలేరని పేర్కోన్నారు. మిస్టర్ కూల్ అన్న నామసార్ధకం చేసుకున్న వ్యక్తి ధోని అని ప్రశంసించాడు.

గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో తలపడిన మ్యాచ్ లో భారత్‌ స్వల్ప తేడాతో ఓడిపోయింది. అనంతరం ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు పునరాగమనం చేయలేదు. దీంతో రోజురోజుకూ అతడి రిటైర్మెంట్‌పై అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. త్వరలో జరగబోయే ఐపీఎల్లో ధోనీ ఆడతాడని, చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ముందుండి నడిపిస్తాడని ఆ జట్టు యజమాని శ్రీనివాసన్‌ చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles